News December 1, 2024

అల్లు అర్జున్.. నంద్యాలలో ప్రీరిలీజ్ పెట్టండి: ఎంపీ శబరి

image

పుష్ప-2 విడుదల సందర్భంగా ఆ మూవీ హీరో అల్లు అర్జున్‌పై ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు ఇంకా మరచిపోలేదు. అదే తరహాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒకటి నంద్యాలలో ప్లాన్ చేయండి. మీరు నంద్యాలకు రావడమనే సెంటిమెంట్ మాకు బాగా పనిచేసింది. మీ పుష్ప-2 పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News January 25, 2026

బడ్జెట్ సమావేశాల్లో జమిలి, అమరావతి బిల్లులు!

image

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ‘జమిలి ఎన్నికల’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే JPC నివేదిక సిద్ధమైంది. అమరావతిని AP రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుతో పాటు, ‘పూర్వోదయ’ పథకం కింద రాష్ట్రానికి భారీ నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను సరళీకరణ, వక్ఫ్ బోర్డు సవరణలు, ‘వికసిత్‌ భారత్‌ శిక్షా అధీక్షణ్‌ బిల్లు’ కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

News January 25, 2026

నేపియర్ కంటే 4G బుల్లెట్ సూపర్ నేపియర్ ఎందుకు ప్రత్యేకం?

image

నేపియర్ గడ్డి ముదిరితే కాండం కాస్త గట్టిగా ఉంటుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్ కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండి, పాడి పశువు తినడానికి సులువుగా ఉంటుంది. నేపియర్‌తో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి చాలా గుబురుగా పెరుగుతుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్‌లో ప్రొటీన్ కంటెంట్, దిగుబడి, మొక్కలు పెరిగే ఎత్తు, మొక్క ఆకుల్లోని మృదుత్వం.. సాధారణ నేపియర్ గడ్డి కంటే ఎక్కువగా ఉంటుంది.

News January 25, 2026

ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది. నిన్న రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. అటు పలు చోట్ల చలి తీవ్రత కొనసాగుతోంది.