News January 27, 2025
బాలకృష్ణకు అల్లు అర్జున్ విషెస్

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినిమాకు అందించిన సేవలకు గానూ పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి ఆయన పూర్తి అర్హులంటూ ట్వీట్ చేశారు. ఆ అవార్డుకు ఎంపికైన మరో హీరో అజిత్ సాధించిన ఘనత తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అలాగే, పద్మ అవార్డులకు ఎంపికైన శోభన, శేఖర్ కపూర్, అనంత్ నాగ్‌లకు అల్లు అర్జున్ విషెస్ తెలిపారు.
Similar News
News February 6, 2025
ఏనుగులూ పగబడతాయ్!

పాము పగబడుతుందని పెద్దలు చెప్తే విన్నాం. అలాగే ఏనుగులు సైతం తమకు నచ్చని వ్యక్తులపై పగ పెంచుకుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ‘ఎవరైనా తమకు నష్టం కలిగిస్తే ఏనుగులు వారిని గుర్తు పెట్టుకుంటాయి. ఎంతమందిలో ఉన్నా వారిని గుర్తించి దాడి చేస్తాయి. ఇలాంటి ఘటనే ఇటీవల చిత్తూరులో జరిగింది. అటవీ శాఖకు చెందిన ఓ వ్యక్తి ఏనుగుతో మిస్ బిహేవ్ చేయడంతో 20 మందిలో ఉన్నా అతణ్నే చంపేసింది’ అని చెప్పారు.
News February 6, 2025
భారత క్రికెట్‌కు లతా మంగేష్కర్ సాయం

గాన కోకిల లతా మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ఆమె టీమ్ఇండియాకు చేసిన సహాయం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. జట్టు కోసం నిధుల సేకరణ కోసం ఢిల్లీలో 1983లో కన్సర్ట్ నిర్వహించారు. ఆమె సోదరుడు పండిత్ హృద్యనాథ్ స్వరపరిచిన ‘భారత్ విశ్వ విజేత’ సాంగ్‌ను లతా పాడారు. దీనికి కపిల్ దేవ్ టీమ్, సపోర్ట్ స్టాఫ్‌తో పాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హాజరయ్యారు. వచ్చిన రూ.20లక్షలను ఆమె ప్లేయర్లకు అందించారు.
News February 6, 2025
ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే?

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని మోదీ ఈనెల 24న విడుదల చేయనున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆరోజున బిహార్‌లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అదే సమయంలో పీఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ పథకం కింద కేంద్రం ఒక్కో రైతుకు ఏడాదికి 3 విడతల్లో ₹2వేల చొప్పున మొత్తం ₹6వేలు అందిస్తోంది. e-KYC పూర్తి చేసిన వారికే ఈ డబ్బులు జమవుతాయి.