News January 8, 2025

నిబంధనల ప్రకారమే అల్లు అర్జున్ విడుదల: డీజీ

image

TG: అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదని డీజీ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ఆయనను రిలీజ్ చేశామన్నారు. గత నెల 13న బన్నీని పోలీసులు అరెస్ట్ చేయగా, అదే రోజు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ ఆన్‌లైన్‌లో ఆలస్యంగా అప్‌లోడ్ కావడంతో ఆయనను ఆ రోజు రాత్రి జైల్లోనే ఉంచి తర్వాతి రోజు విడుదల చేశారు. దీంతో పోలీసులు కావాలనే అలా చేశారని ఆరోపణలు వచ్చాయి.

Similar News

News January 17, 2025

రీఛార్జ్ చేసుకునే వారికి GOOD NEWS

image

దేశంలోని 15 కోట్ల 2G యూజర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. వాయిస్ కాల్స్, SMS వంటి బేసిక్ సర్వీసులు మాత్రమే అవసరమయ్యే వీరి కోసం రూ.10తో రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. దీంతో ఇంటర్నెట్ అవసరం లేని వారు భారీ మొత్తంతో రీఛార్జ్ చేసుకునే తిప్పలు తప్పుతాయి. అలాగే స్పెషల్ టారిఫ్ వోచర్ (STV)ల వ్యాలిడిటీ 90 రోజులు ఉండగా తాజాగా 365 రోజులకు పెంచింది.

News January 17, 2025

3.5 కోట్ల పని దినాలు కల్పించండి.. కేంద్రానికి లేఖ

image

AP: ఉపాధి హామీ పని దినాలు పూర్తి కావొస్తుండటంతో అదనంగా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం 21.50 కోట్ల పనిదినాలు కేటాయించగా 20.45 కోట్ల పని దినాలు పూర్తి చేశారు. దీంతో మరో 3.5 కోట్ల పనిదినాలు కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

News January 17, 2025

సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీలు

image

TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దీంతో నేటి నుంచి కాలేజీ విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. మరోవైపు స్కూళ్లకు సెలవులు నేటితో ముగియనుండటంతో రేపు పాఠశాలలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఆదివారం వరకు సెలవులు పొడిగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అటు ఏపీలో స్కూళ్లు 20న పునః ప్రారంభం కానున్నాయి.