News December 13, 2024
అల్లు అర్జున్ విడుదల ఆలస్యం
చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కాస్త ఆలస్యం కానుంది. న్యాయమూర్తి ఆదేశాల కాపీ సైట్‌లో అప్‌లోడ్ అయిన తర్వాత వాటిని జైలర్ వెరిఫై చేసుకుని ఖైదీలను రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం తీర్పు కాపీ ప్రిపరేషన్‌లో ఉందని సమాచారం. దీంతో బన్నీ బయటకు వచ్చేందుకు మరో అరగంటకు పైగా సమయం పట్టవచ్చని తెలుస్తోంది. కాగా బన్నీకి స్వాగతం పలికేందుకు జైలు బయట భారీగా ఫ్యాన్స్, ఇంటి వద్ద కుటుంబీకులు వేచి చూస్తున్నారు.
Similar News
News January 17, 2025
VIRAL: అప్పట్లో రూ.18కే తులం బంగారం
మార్కెట్‌లో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. నిత్యం రూ.వందల్లో పెరుగుతూ అప్పుడప్పుడూ తగ్గుతూ మధ్యతరగతి ప్రజలను ఊరిస్తుంటుంది. అసలు వందేళ్ల క్రితం పది గ్రాములు బంగారం ధర ఎంతుందో తెలుసా? 1925లో దీని ధర రూ.18.75 ఉండగా 2025లో రూ.80,620గా ఉంది. 1959లో తొలిసారి రూ.100 దాటి రూ.102.56కి 1980లో తొలిసారి వెయ్యి దాటి రూ.1330, 1985లో రూ.2130, 1996లో రూ.5160, 2007లో రూ.10,800 కాగా 2022లో రూ.52వేలకు చేరింది.
News January 17, 2025
రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల
TG: గ్రూప్-2 ‘కీ’ రేపటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో వస్తుందని టీజీపీఎస్సీ పేర్కొంది. ఈనెల 18 నుంచి 22న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలను తెలపొచ్చని వెల్లడించింది. కాగా డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్ష జరిగింది.
News January 17, 2025
సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు
దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీఖాన్‌ను అతడి పెద్ద కొడుకు ఇబ్రహీం హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే సైఫ్ వెంట ఏడేళ్ల కుమారుడు తైమూర్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఒళ్లంతా రక్తంతో ఉన్న వ్యక్తి చిన్న పిల్లాడితో కలిసి తన ఆటో ఎక్కాడని, ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అడిగారని డ్రైవర్ వెల్లడించారు. ఆ తర్వాతే తాను ఆయనను సైఫ్‌గా గుర్తుపట్టినట్లు అతడు చెప్పారు.