News May 25, 2024
అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్.. కానిస్టేబుళ్లపై వేటు

AP: నంద్యాలలో YCP అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో తొలిగా ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ర్యాలీ సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలతో కానిస్టేబుళ్లు నాయక్, నాగరాజులను SP వీఆర్‌కు పంపారు. మరికొందరు అధికారులపైనా చర్యలుంటాయేమో చూడాలి. ఇప్పటికే అల్లు అర్జున్, రవిపైనా కేసు నమోదైంది. ఈ నెల 11న అల్లు అర్జున్ నంద్యాల రాగా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారని ECకి ఫిర్యాదులందాయి.
Similar News
News November 23, 2025
జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్: KTR

ఏపీ మాజీ సీఎం జగన్‌ను <<18362238>>కలిసిన<<>> ఫొటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జగన్ అన్నతో గ్రేట్ మీటింగ్’ అని పేర్కొన్నారు. మరోవైపు జగన్, కేటీఆర్ కలవడంతో అటు వైసీపీ, ఇటు BRS ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News November 23, 2025
ప్రతి ఇంటికి బైక్ ఉండాలన్నదే నా లక్ష్యం: విజయ్

వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తథ్యమని TVK పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. కరూర్ తొక్కిసలాట తర్వాత ఆయన తొలిసారిగా కాంచీపురం సభలో మాట్లాడారు. ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. DMK తమకు రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విజయ్ ఆరోపించారు.
News November 23, 2025
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దుమ్మురేపిన లక్ష్యసేన్

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో అద్భుత విజయం సాధించారు. జపాన్ ఆటగాడు యూషీ తనాకాపై 21-15, 21-11 తేడాతో జయకేతనం ఎగరవేశారు. దీంతో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన మూడో భారత ఆటగాడిగా లక్ష్య నిలిచారు. ఈ సీజన్లో అతనికి ఇదే తొలి BWF టైటిల్. అలాగే తన కెరీర్లో మూడో సూపర్ 500 టైటిల్.


