News May 25, 2024
అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్.. కానిస్టేబుళ్లపై వేటు

AP: నంద్యాలలో YCP అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో తొలిగా ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ర్యాలీ సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలతో కానిస్టేబుళ్లు నాయక్, నాగరాజులను SP వీఆర్‌కు పంపారు. మరికొందరు అధికారులపైనా చర్యలుంటాయేమో చూడాలి. ఇప్పటికే అల్లు అర్జున్, రవిపైనా కేసు నమోదైంది. ఈ నెల 11న అల్లు అర్జున్ నంద్యాల రాగా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారని ECకి ఫిర్యాదులందాయి.
Similar News
News February 14, 2025
మద్యం తాగేవాళ్లలో తెలంగాణ వారే టాప్

సౌత్ ఇండియాలో TGలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని రాజ్యసభలో మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. అదే సమయంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని తెలిపారు. 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం APలో 34.9%, TGలో 53.8% మంది పురుషులు మద్యం సేవించేవారని వివరించారు. 2019-21 నాటికి ఇది APలో 31.2%, TGలో 50శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు.
News February 14, 2025
దారుణం.. బుల్లెట్ బైక్ నడిపాడని చేతులు నరికేశారు

తమిళనాడులో దారుణం జరిగింది. శివగంగ జిల్లాకు చెందిన దళిత విద్యార్థి అయ్యసామి డిగ్రీ చదువుతున్నారు. ఇటీవల తనకిష్టమైన బుల్లెట్ బైకుపై కాలేజీకి వెళ్లొస్తుండగా ముగ్గురు అగ్రవర్ణ యువకులు అతడిపై దాడి చేశారు. ‘కులం తక్కువవాడివి.. మా ముందే బండెక్కుతావా, నీకు బుల్లెట్ కావాలా?’ అని కత్తులతో రెండు చేతులను నరికేశారు. అంతటితో ఆగకుండా సామి ఇంటినీ ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
News February 14, 2025
జులపాల జుట్టుతో స్టార్ క్రికెటర్లు.. చూశారా?

ఏఐ సహాయంతో కొందరు క్రియేట్ చేసిన స్టార్ క్రికెటర్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెటర్లు పొడవాటి జుట్టుతో ఉంటే ఎలా ఉంటుందో క్రియేట్ చేశారు. కోహ్లీ, రోహిత్, బట్లర్, కేఎల్ రాహుల్, బాబర్ ఆజమ్, విలియమ్సన్ వంటి ప్లేయర్ల ఫొటోలను ఉపయోగించారు. ఈ ఫొటోలు చూసిన క్రికెట్ లవర్స్ సూపర్ అంటున్నారు. లాంగ్ హెయిర్‌తో తమ అభిమాన క్రికెటర్ల ఫొటోలు అదిరిపోయాయని కామెంట్లు చేస్తున్నారు.