News December 13, 2024

ట్విటర్ ట్రెండింగ్‌లో #AlluArjunArrest

image

‘పుష్ప-2’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం ప్రకంపనలు సృష్టించింది. సక్సెస్ మీట్ కోసం నిన్న ఢిల్లీకి వెళ్లొచ్చిన అర్జున్‌ను ఉదయమే అరెస్ట్ చేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. దీంతో #AlluArjunArrest హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. నార్త్ ఇండియన్ అభిమానులు సైతం ఆయనకు సపోర్ట్‌గా ట్వీట్స్ చేస్తున్నారు.

Similar News

News January 18, 2025

కెప్టెన్సీ రేసు నుంచి హార్దిక్ పాండ్య ఔట్!

image

రోహిత్ శర్మ తర్వాత వన్డే, టీ20 జట్లకు హార్దిక్ పాండ్యకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ఒక దశలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే తరచూ గాయాల పాలవుతుండటం, నిలకడలేమితో బీసీసీఐ అతడిని పరిగణనలోకి తీసుకోవట్లేదు. భవిష్యత్తులోనూ అతని కెప్టెన్సీ కల కల్లగానే మిగిలిపోనుందని విశ్లేషకుల అంచనా. టీ20లకు సూర్య(కెప్టెన్), అక్షర్‌(VC)కు అవకాశం ఇవ్వగా, వన్డేల్లో రోహిత్‌కు డిప్యూటీగా గిల్‌ను ప్రమోట్ చేస్తోంది.

News January 18, 2025

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

image

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు STT గ్లోబల్ డేటా సెంటర్ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ సంస్థ రూ.3500 కోట్లతో మీర్‌ఖాన్‌పేట్‌లో ఆర్ట్ డేటా సెంటర్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుందని వెల్లడించారు. సింగపూర్‌ పర్యటన సందర్భంగా ఈ ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ సంస్థకు హైటెక్ సిటీలో ఇప్పటికే ఓ ఆఫీస్ ఉంది.

News January 18, 2025

సైఫ్‌పై దాడి.. నిందితుడి అరెస్ట్!

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దుర్గ్ రైల్వే స్టేషన్‌లో RPF పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి బయల్దేరారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ముంబైకి తరలించనున్నారు. షాలీమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో అతడు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.