News December 14, 2024

అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్‌కు నిరాశ

image

అల్లు అర్జున్ రేపు ఉదయం విడుదల కానున్నారని జైలు అధికారులు వెల్లడించడంతో అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో జైలు నుంచి ఆయన విడుదల అవుతారని సాయంత్రం నుంచి చంచల్‌గూడ జైలు బయట ఎదురుచూసిన అభిమానులు అసహనంతో వెనుదిరిగారు. అటు, అల్లు కుటుంబం కూడా రాత్రికి బన్నీ తిరిగొస్తాడని ఆశగా ఎదురు చూడగా నిరాశే మిగిలింది.

Similar News

News October 18, 2025

కంటెంట్ క్రియేటర్లకు మస్క్ గుడ్‌న్యూస్

image

‘X’ అధినేత ఎలాన్ మస్క్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు. తమ ఫీడ్ రికమెండేషన్ అల్గారిథమ్‌ను మార్చబోతున్నట్లు తెలిపారు. ‘6 వారాల్లో ఫీడ్ రికమెండేషన్ Grok AIకు అప్పగిస్తాం. అది ప్రతి పోస్టు, రోజుకు 100మి+ వీడియోలు చూస్తుంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను రికమెండ్ చేస్తుంది’ అని తెలిపారు. అంటే పేజ్, ఫాలోవర్లతో సంబంధం లేదు. మీ కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే అది ఆటోమేటిక్‌గా వైరలయ్యే ఛాన్సుంటుంది.

News October 18, 2025

అక్టోబర్ 18: చరిత్రలో ఈ రోజు

image

1931: విద్యుత్ బల్బు ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్ మరణం
1968: భారత మాజీ క్రికెటర్ నరేంద్ర హిర్వాణి జననం
1976: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మరణం
1978: సినీ నటి జ్యోతిక జననం
1991: భారత మాజీ క్రికెటర్ జయదేవ్ ఉనడ్కట్ జననం
2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మరణం
2013: రచయిత రావూరి భరద్వాజ(ఫొటోలో) మరణం

News October 18, 2025

పాక్ దాడుల్లో 8 మంది అప్గాన్ క్రికెటర్లు మృతి!

image

పాక్ జరిపిన వైమానిక దాడుల్లో అప్గానిస్థాన్ క్లబ్ లెవల్ క్రికెటర్లు 8మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అప్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. మరో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. మ్యాచులు పూర్తయ్యాక క్రికెటర్లు పక్టికాలోని షరానా నుంచి అర్గోన్‌కు వెళ్తుండగా బాంబు దాడులకు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో పౌరులు, చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.