News December 14, 2024
అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్‌కు నిరాశ
అల్లు అర్జున్ రేపు ఉదయం విడుదల కానున్నారని జైలు అధికారులు వెల్లడించడంతో అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో జైలు నుంచి ఆయన విడుదల అవుతారని సాయంత్రం నుంచి చంచల్‌గూడ జైలు బయట ఎదురుచూసిన అభిమానులు అసహనంతో వెనుదిరిగారు. అటు, అల్లు కుటుంబం కూడా రాత్రికి బన్నీ తిరిగొస్తాడని ఆశగా ఎదురు చూడగా నిరాశే మిగిలింది.
Similar News
News January 17, 2025
సెలవులు ముగిశాయ్
తెలంగాణలోని స్కూళ్లకు నేటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దాదాపు వారం రోజులు పండగ హాలిడేస్ ఎంజాయ్ చేసిన విద్యార్థులు రేపటి నుంచి బడి బాట పట్టనున్నారు. రాబోయే 2, 3 నెలలు పరీక్షాసమయం కావడంతో స్టూడెంట్స్ ఇక పుస్తకాలకే అంకితం కానున్నారు. కాగా ఈనెల 11 నుంచి 17 వరకు ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు జూనియర్ కాలేజీలు ఇవాళ్టి నుంచి పున:ప్రారంభం అయ్యాయి.
News January 17, 2025
రేషన్‌కార్డుల ఎంపికలో గందరగోళం.. విమర్శలు
TG: రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తమకు అందజేసిన జాబితా ప్రకారం గ్రామాల్లో సిబ్బంది సర్వే చేస్తున్నారు. ప్రజాపాలన సందర్భంగా కార్డు కోసం అప్లై చేసినా జాబితాలో పేరు లేకపోవడం ఏంటని చాలామంది సిబ్బందిని నిలదీస్తున్నారు. అర్హుల ఎంపికకు ప్రభుత్వం దేన్ని ప్రాతిపదికగా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. కులగణన ఆధారంగా సర్కార్ జాబితా రూపొందించినట్లు సమాచారం.
News January 17, 2025
చాగంటికి తిరుమలలో అవమానమంటూ వార్తలు.. ఖండించిన TTD
AP: రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలను TTD ఖండించింది. ప్రవచనం కోసం పిలిపించి కార్యక్రమాన్ని రద్దు చేశారనేది అవాస్తవమని పేర్కొంది. ఆయన అంగీకారంతోనే మరో రోజుకు వాయిదా వేశామంది. చాగంటినే సాధారణ భక్తుల తరహాలో శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించింది. అసత్య వార్తలను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.