News July 30, 2024

ఇప్పటికే పెట్రోల్, పాలు.. తాజాగా బీర్ల ధరలు పెంపు

image

కర్ణాటకలో బీరు ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. గత 17 నెలల్లో మద్యం ధరలు ఎగబాకడం ఇది 5వ సారి. ముడి సరుకుల ధరల్లో మార్పుల వల్లే రేట్లను పెంచినట్లు కంపెనీలు తెలిపాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు కొలువుదీరినప్పటి నుంచి వాణిజ్య వాహనాలపై రవాణా సెస్, స్టాంప్ డ్యూటీ, పెట్రోల్ లీటర్‌పై రూ.3, నందిని పాల ధరలు పెరిగాయి. 5 గ్యారంటీల అమలుకు నిధుల కొరతే రేట్ల పెరుగుదలకు కారణమని వార్తలొస్తున్నాయి.

Similar News

News November 14, 2025

MGB సీఎం అభ్యర్థి తేజస్వీ వెనుకంజ

image

ఆర్జేడీ కీలక నేత, MGB సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. రాఘోపూర్ నుంచి పోటీ చేసిన ఆయన 3,000 ఓట్లతో వెనుకపడ్డారు. 4వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్‌కు 17,599 ఓట్లు రాగా, తేజస్వీకి 14,583 ఓట్లు వచ్చాయి. ఇంకా 26 రౌండ్లు ఉన్నాయి.

News November 14, 2025

15వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వరుసగా 6 రౌండ్లలో నవీన్ యాదవ్ ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం ఆయన 15,589 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. రౌండ్ రౌండ్‌కు ఆయన ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: TPCC చీఫ్

image

జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడుతున్నారని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. మెజారిటీ ఇంకా ఎక్కువ రావాల్సి ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం ప్రభావం చూపుతోందన్నారు. BRS డైవర్షన్ పాలిటిక్స్‌ చేసిందని, మహిళల సెంటిమెంట్‌ను వాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అయినా ప్రజలు అభివృద్ధి కోసం ఆలోచించారని, ఈ ఫలితం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.