News July 30, 2024
ఇప్పటికే పెట్రోల్, పాలు.. తాజాగా బీర్ల ధరలు పెంపు
కర్ణాటకలో బీరు ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. గత 17 నెలల్లో మద్యం ధరలు ఎగబాకడం ఇది 5వ సారి. ముడి సరుకుల ధరల్లో మార్పుల వల్లే రేట్లను పెంచినట్లు కంపెనీలు తెలిపాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు కొలువుదీరినప్పటి నుంచి వాణిజ్య వాహనాలపై రవాణా సెస్, స్టాంప్ డ్యూటీ, పెట్రోల్ లీటర్‌పై రూ.3, నందిని పాల ధరలు పెరిగాయి. 5 గ్యారంటీల అమలుకు నిధుల కొరతే రేట్ల పెరుగుదలకు కారణమని వార్తలొస్తున్నాయి.
Similar News
News October 8, 2024
ఢిల్లీలో ₹65కే కిలో టమాటా
టమాటా రేటు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని సామాన్యులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. అక్కడ కిలో టమాటా ₹100-₹120 పలుకుతోంది. దీంతో హోల్‌సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఢిల్లీ సహా శివారులోని 56 ప్రాంతాల్లో ₹65కే ప్రజలకు అందిస్తోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా టమాటా పండించే ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో దిగుబడి బాగా తగ్గింది. దీంతో ధరలు పెరిగాయి.
News October 8, 2024
ఈరోజు దుర్గమ్మను దర్శిస్తే ఐశ్వర్యమే!
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు విజయవాడ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. మంగళప్రదమైన దుర్గమ్మను దర్శించుకున్న వారికి ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుందని ప్రతీతి. మూడు శక్తుల్లో ఒకరైన శ్రీ మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించిన విషయం తెలిసిందే.
News October 8, 2024
నేడు అమిత్‌షా, నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ
AP: ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న PM మోదీతో సమావేశమైన CM చంద్రబాబు ఇవాళ పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. వరద నష్టం, నిధుల విడుదలపై హోంమంత్రి అమిత్‌షాతో, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ విలీన ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై నితిన్ గడ్కరీతో సమాలోచనలు చేస్తారు. పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్‌తో ఆయన భేటీ కానున్నారు.