News December 16, 2024
అమరావతి ఇన్వెస్టర్లలో భయం పట్టుకుంది: పొంగులేటి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733846759453_1226-normal-WIFI.webp)
TG: HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, అమరావతికి పెట్టుబడులు వెళ్తాయనే ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు రాగానే రియల్ ఎస్టేట్ అమరావతికి వెళ్తోందనేది ప్రచారం మాత్రమే. ఇటీవల వరదల వల్ల అక్కడ పెట్టుబడులు పెట్టేవారికి భయం పట్టుకుంది. HYD, బెంగళూరుకే ఇన్వెస్టర్లు వస్తున్నారు. హైడ్రాపై మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసింది’ అని అన్నారు.
Similar News
News January 21, 2025
ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737395651841_782-normal-WIFI.webp)
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. అధ్యక్షుడిగా పదవీకాలం విజయవంతంగా పూర్తి కావాలి. ఇరు దేశాల ప్రయోజనం కోసం కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.
News January 21, 2025
వారిని ప్రోత్సహించడంలో వివక్ష ఉండదు: ట్రంప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737394591859_782-normal-WIFI.webp)
అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ట్రంప్ అన్నారు. ‘నేరాలు చేసే ముఠాలతో కఠినంగా వ్యవహరిస్తాం. ఎలక్ట్రిక్ వాహనాలు అధికంగా తయారు చేస్తాం. అమెరికన్ డ్రీమ్ అనేది ప్రపంచ నలుమూలల్లోని ప్రతిభావంతుల కల. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో వివక్ష ఉండదు. శాంతి నెలకొల్పేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తాం. నిన్న గాజాలో బందీలు విడుదల కావడం సంతోషంగా ఉంది’ అని ట్రంప్ వివరించారు.
News January 21, 2025
అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ: ట్రంప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737394088389_782-normal-WIFI.webp)
2025 అమెరికా ప్రజలకు స్వేచ్ఛాయుత సంవత్సరం అని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తాం. అక్రమ వలసలు అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటాం. భిన్న సంస్కృతుల, సంప్రదాయాల కలయికే అమెరికా. దేవుడి దయ వల్ల తుపాకీ కాల్పుల నుంచి బయటపడ్డా. అమెరికా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తా. రాజ్యాంగబద్ధంగా, ప్రజస్వామ్యబద్ధంగా పని చేస్తాం’ అని ట్రంప్ అన్నారు.