News February 28, 2025

అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు, హడ్కో రుణాలు ఇస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, దీనికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని చెప్పారు. ఇప్పటికే రూ.48వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, మార్చి 10న ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. మేలో తల్లికి వందనం, ఆ తర్వాత అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.

Similar News

News March 20, 2025

ఒకే ఫ్రేమ్‌లో కెప్టెన్లు

image

ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. ఐపీఎల్ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లు గ్రూప్ ఫొటో దిగారు. కెప్టెన్లు కమిన్స్, అయ్యర్, గిల్, పంత్, రుతురాజ్, హార్దిక్, పాటిదార్, శాంసన్, రహానే, అక్షర్ పటేల్ ఫొటోషూట్‌లో సందడి చేశారు. కాగా ఎల్లుండి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. 65 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచులు జరగనున్నాయి.

News March 20, 2025

చరిత్ర సృష్టించిన ‘ఛావా’

image

శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చరిత్ర సృష్టించింది. ‘బుక్‌ మై షో’లో 12 మిలియన్ టికెట్లు సేల్ అయిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. దేశంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు(రూ.767కోట్లు), విడుదలైన ఐదో వారంలో రూ.22కోట్లు వసూలు చేసిన తొలి మూవీగానూ హిస్టరీ క్రియేట్ చేసింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా FEB 14న రిలీజైన విషయం తెలిసిందే.

News March 20, 2025

వీరు షెఫ్‌లే.. కానీ ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే

image

షెఫ్‌లే కదా అని వారిని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. వారి ఆస్తులు రూ.కోట్లలో ఉంటాయి మరి. ప్రకటనల్లో తరచూ కనబడే సంజీవ్ కపూర్ దేశంలోని షెఫ్‌లలో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి విలువ రూ.1165 కోట్లకు పైమాటే. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వికాస్ ఖన్నా(సుమారు రూ.120 కోట్లు), రణ్‌వీర్ బ్రార్(రూ.41 కోట్లు), కునాల్ కపూర్ (రూ.43.57 కోట్లు), గరిమా అరోరా (రూ.40 కోట్లు), హర్‌పాల్ సింగ్ సోఖి(రూ.35 కోట్లు) ఉన్నారు.

error: Content is protected !!