News March 19, 2025
అమరావతికి రూ.31,600 కోట్ల ఖర్చు: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. ప్రజలు చెల్లించిన పన్నుల్లో రూపాయి కూడా అమరావతికి ఖర్చు చేయొద్దని సీఎం ఆదేశించారన్నారు. దీని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ADB రూ.15,000 కోట్లు, హడ్కో రూ.15వేల కోట్లు, కేఎఫ్ డబ్ల్యూ రూ.5వేల కోట్ల రుణం దశలవారీగా తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో రూ.31,600 కోట్లు వెచ్చిస్తామని మండలిలో పేర్కొన్నారు.
Similar News
News October 14, 2025
హైకోర్టు స్టేపై సుప్రీంలో పిటిషన్.. నేడే విచారణ!

TG: BC రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై 50పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసును రిఫరెన్స్గా చూపింది. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావించింది. 50% రిజర్వేషన్ల క్యాప్ దాటొద్దని చెప్పినా అది విద్య, ఉపాధి రంగాలకే పరిమితమని గుర్తు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశముంది.
News October 14, 2025
పశువులు, గొర్రెల, మేకల ఎరువుతో లాభాలు

ఒక టన్ను పశువుల ఎరువును పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19 KGల పొటాష్ పొలానికి అందుతాయి. గొర్రెలు, మేకల ఎరువు టన్ను వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్ భూమికి అందుతుంది. పొలంలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతోనూ భూసారం పెరుగుతుంది.
News October 14, 2025
APPLY NOW: ఐఐటీ ఇండోర్లో 16 పోస్టులు

ఐఐటీ ఇండోర్ 16 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ, ఏదైనా ఐఐటీ నుండి డిజైనింగ్ డిప్లొమా/ ఆర్ట్స్/అప్లైడ్ ఆర్ట్స్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iiti.ac.in/