News April 14, 2025

అమర్‌నాథ్ యాత్ర-2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం

image

JULY 3 నుంచి AUG 9 వరకు జరిగే అమర్‌నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.nic.in/ <>సైట్‌లో<<>> పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, హెల్త్ సర్టిఫికెట్, OTP సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి గ్రూప్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

Similar News

News January 23, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.5,400 పెరిగి రూ.1,59,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,950 ఎగబాకి రూ.1,46,400గా ఉంది. కిలో వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.3,60,000గా నమోదైంది.

News January 23, 2026

తిరుమల అప్‌డేట్.. 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

image

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 64,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,634 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా నమోదైంది.

News January 23, 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో కాస్త తడబడ్డప్పటికీ కాసేపటికే పుంజుకున్నాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 82,425 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 25,313 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో TCS, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL టెక్ షేర్లు లాభాల్లో.. ఇండిగో, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.