News March 6, 2025
జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర

కశ్మీర్‌లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో ముగుస్తుంది. త్వరలోనే యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.
Similar News
News March 6, 2025
జైశంకర్‌పై ఖలిస్థానీల దాడి యత్నంపై మండిపడ్డ భారత్

EAM జైశంకర్ UK పర్యటనలో భద్రతా <<15666524>>లోపంపై<<>> భారత్ తీవ్రంగా స్పందించింది. ఖలిస్థానీలవి రెచ్చగొట్టే చర్యలని మండిపడింది. ‘జైశంకర్ పర్యటనలో భద్రతా లోపాన్ని ఫుటేజీలో మేం పరిశీలించాం. వేర్పాటువాదులు, అతివాదుల రెచ్చగొట్టే చర్యల్ని ఖండిస్తున్నాం. వారు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం విచారకరం. ఇలాంటి ఘటనలపై ఆతిథ్య ప్రభుత్వం మేం కోరుకుంటున్నట్టు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపింది.
News March 6, 2025
దగ్గుబాటి విశిష్టమైన వ్యక్తి: సీఎం చంద్రబాబు

AP: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశంపై లోతుగా విశ్లేషణ చేస్తారని సీఎం చంద్రబాబు కొనియాడారు. తమ ఫ్యామిలీలో ఆయనొక విశిష్టమైన, సంతోషకరమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇరు కుటుంబాలు 40 ఏళ్లుగా కలసి ఉన్నాయని చెప్పారు. తామిద్దరం ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తి పొందామన్నారు. దగ్గుబాటి రచయిత కాకపోయినా ఎవరూ టచ్ చేయని అంశంపై పుస్తకం రాశారని ప్రశంసించారు.
News March 6, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. న్యూజిలాండ్‌కు షాక్?

CT: నిన్న SAతో జరిగిన సెమీస్‌లో కివీస్ బౌలర్ హెన్రీ గాయపడ్డారు. క్లాసెన్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో భుజం నేలకు బలంగా తాకింది. వెంటనే మైదానాన్ని వీడిన అతను మళ్లీ వచ్చినా బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డారు. దీంతో ఆదివారం INDతో జరిగే ఫైనల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే కివీస్‌కు పెద్ద దెబ్బే. అతని గాయం తీవ్రతను పరిశీలిస్తున్నామని కెప్టెన్ శాంట్నర్ చెప్పారు. కాగా హెన్రీ INDపై 21 వికెట్లు తీశారు.