News March 30, 2024

అద్భుతం.. ఒక బిడ్డ పుట్టిన 22 రోజులకు మరో శిశువు జననం

image

నిమిషాల వ్యవధిలో పుట్టిన వాళ్లను కవలలు అంటాం. అయితే ENGలో డోయల్ అనే మహిళకు ఓ బిడ్డ పుట్టి చనిపోయిన 22 రోజులకు మరో శిశువు జన్మించింది. ఇది అరుదైన సంఘటన అని, కవలలు ఇంత గ్యాప్‌లో జన్మించడం చూడలేదని వైద్యులు తెలిపారు. ‘బొడ్డు తాడులో రక్తం గడ్డకట్టి మొదటి శిశువు చనిపోయింది. తర్వాత నొప్పులు రాకపోవడంతో ఇంటికి పంపాం. 22 రోజులకు పెయిన్స్ రావడంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశాం’ అని పేర్కొన్నారు.

Similar News

News January 25, 2025

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య 15 రోజుల పాటు ట్యాప్ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆయన పీఏ నిన్న విచారణకు హాజరయ్యారు. 2023 DECలో అధికార మార్పిడి తర్వాత ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అయిన ఇంద్రసేనా రెడ్డి 2023 OCTలో గవర్నర్‌గా నియమితులయ్యారు.

News January 25, 2025

చంద్రబాబుకు బిల్ గేట్స్ గిఫ్ట్

image

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తనకు తన ‘సోర్స్ కోడ్’ బుక్‌ను ఇచ్చారని AP CM చంద్రబాబు తెలిపారు. కాలేజీని వదిలి మైక్రో‌సాఫ్ట్‌ను ఎలా ప్రారంభించారు? ఆయన జర్నీకి సంబంధించిన అనుభవాలు, పాఠాలను ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. ఈ బుక్ చాలా మందికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. బిల్ గేట్స్‌కు ఆల్ ది బెస్ట్‌తో పాటు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల దావోస్‌లో వీరిద్దరూ భేటీ అయిన సంగతి తెలిసిందే.

News January 25, 2025

జగన్, VSR కలిసి డ్రామా ఆడుతున్నారు: బుద్దా వెంకన్న

image

AP: రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం జగన్‌కు తెలిసే జరిగిందని TDP నేత బుద్దా వెంకన్న అన్నారు. ‘కేసులను పక్కదారి పట్టించేందుకు ఈ డ్రామా. చంద్రబాబుతో విభేదాలు లేవంటే నమ్మేంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. చంద్రబాబు కుటుంబాన్ని నువ్వు అన్న మాటలు మర్చిపోను. నిన్ను క్షమించను. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీల లెక్క తేలాలి. విజయసాయిరెడ్డి దేశం విడిచి వెళ్లడానికి CBI అనుమతి ఇవ్వకూడదు’ అని ట్వీట్ చేశారు.