News July 22, 2024

ఇన్‌స్టా మార్ట్‌పై కన్నేసిన అమెజాన్!

image

ఇన్‌స్టామార్ట్ బిజినెస్‌ను కొనేందుకు అమెజాన్ ఆసక్తికరంగా ఉందని సమాచారం. ఇప్పటికే స్విగ్గీని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీవోకు ముందే వాటా దక్కించుకోవడం లేదా మొత్తంగా వ్యాపారాన్నే కైవసం చేసుకొనే ప్లాన్‌లో ఉందట. సొంతంగా క్విక్ కామర్స్ రంగంలోకి రావాలని అమెజాన్ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది. అయితే గ్లోబల్‌గా క్లియరెన్స్ రావడానికి టైమ్ పట్టేలా ఉండటంతో స్విగ్గీ దారి ఎంచుకొందని తెలుస్తోంది.

Similar News

News December 11, 2024

మోహన్‌బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశం

image

TG: హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

News December 11, 2024

డిసెంబర్ 11: చరిత్రలో ఈ రోజు

image

* 1922: సినీ నటుడు దిలీప్ కుమార్ జననం
* 1931: భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో జననం
* 1953: UNICEF ఏర్పాటు
* 1969: చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జననం
* 1995: హీరోయిన్ నబా నటేష్ జననం
* 2004: MS సుబ్బలక్ష్మీ(ఫొటోలో) మరణం
* 2012: సితార్ వాయిద్యకారుడు రవిశంకర్ మరణం
* అంతర్జాతీయ పర్వత దినోత్సవం

News December 11, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: డిసెంబర్ 11, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5.19 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
అసర్: సాయంత్రం 4.07 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు ఇష: రాత్రి 7.00 గంటలకు
నోట్: ప్రాంతాన్నిబట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.