News November 5, 2024

అంబానీ వెడ్డింగ్‌లో 120రకాల టీలు పెట్టిన మాస్టర్

image

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ఎన్నో విషయాల్లో స్పెషాలిటీ చాటుకుంది. అందులో సర్వ్ చేసిన టీ కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే కుంకుమపువ్వు టీ, పాన్ ఫ్లేవర్ టీతో పాపులరైన మధ్యప్రదేశ్‌కు చెందిన లక్ష్మణ్ ఓజా ఈ శుభకార్యంలో టీ మాస్టర్. ఒకట్రెండు కాదు ఏకంగా 120 రకాల టీలను అతిథులకు అందించారు. దాదాపు 15ఏళ్లుగా ఆయన టీ తయారు చేస్తున్నారు. అంబానీ ఇంట దక్కిన అవకాశంతో తన ఇన్నేళ్ల కృషి ఫలించినట్లైందని అన్నారు.

Similar News

News December 9, 2024

SHOCKING: యూట్యూబ్‌లో పుష్ప-2 స్ట్రీమింగ్

image

పుష్ప-2 నిర్మాతలకు మరో షాక్ తగిలింది. మూవీ విడుదలైన రోజే పలు ఆన్‌లైన్ సైట్లలో లీకవగా తాజాగా కొందరు యూట్యూబ్‌లో హిందీ వెర్షన్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఘటనలపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సమాచారం.

News December 9, 2024

14 ఏళ్ల బాలిక తెగింపు.. ఓ దేశాన్ని కదిలించింది

image

సిరియా అధ్యక్షుడు, డాక్టర్ బషర్ అల్ అసద్ దేశాన్ని వీడటంతో ఆ దేశం రెబల్స్ వశమైంది. ఈ పోరాటానికి 14 ఏళ్ల బాలిక తెగింపు ఆజ్యం పోసింది. అసద్ అరాచకాలను తట్టుకోలేక 2011లో ఆమె దారా అనే గ్రామంలోని గోడలపై ‘ఇక నీ వంతు డాక్టర్’ అని గ్రాఫిటీ చిత్రాలు వేసింది. దీంతో ఆ బాలిక, స్నేహితురాళ్లను పోలీసులు 26 రోజులు హింసించారు. ఈ క్రమంలో దారాలో మొదలైన తిరుగుబాటు దేశంలో అంతర్యుద్ధానికి దారితీసి అసద్ పతనంతో ముగిసింది.

News December 9, 2024

రేపటి నుంచి సమ్మెలోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు

image

TG: తమను రెగ్యులర్ చేస్తామని CM రేవంత్ ఇచ్చిన హామీ నెరవేరలేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10నుంచి సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు. 20ఏళ్లుగా తక్కువ జీతాలకు పని చేస్తున్నామని, పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమ్మెతో కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భవిత సెంటర్లలో బోధన నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు ఆందోళనలో ఉన్నారు.