News June 5, 2024
అంబానీ క్రూయిజ్ పార్టీ ఖర్చు రూ.7,500 కోట్లు?
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇటలీలోని పోర్టోఫినోలో గ్రాండ్‌గా ముగిశాయి. ఈ వేడుకల్లో సుమారు 800 మంది అతిథిలు హాజరయ్యారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలతో పాటు వ్యాపార దిగ్గజాలు ఈ వేడుకల్లో మెరిశారు. ఇందుకుగాను అంబానీ ఫ్యామిలీ దాదాపు రూ.7,500 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్. వచ్చే నెల 12న ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్-రాధిక వివాహం జరగనుంది.
Similar News
News December 9, 2024
లోన్ తిప్పలు: ₹39 వేల కోడి మాంసం ఆరగించిన బ్యాంకు మేనేజర్
లోన్ అప్రూవ్ చేయడానికి ఓ కస్టమర్ నుంచి ₹39 వేల కోడి మాంసం ఆరగించాడో బ్యాంకు మేనేజర్. ఛత్తీస్‌గఢ్‌లోని మస్తూరీకి చెందిన రూప్‌చంద్ పౌల్ట్రీ వ్యాపారాన్ని విస్తరించేందుకు ₹12 లక్షల రుణం కోసం SBI మేనేజర్‌ను కలిశారు. ఆయన 10% కమీషన్ తీసుకున్నారు. అలాగే ప్రతి శనివారం చికెన్ పంపాల్సిందిగా ఆదేశించారు. ₹39K కోడి మాంసం ఆరగించినా లోన్ మంజూరు చేయకపోవడంపై బాధితుడు మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు.
News December 9, 2024
‘INDIA’ బాధ్యతలపై చర్చ ఎప్పుడైంది?: ఒమర్
INDIA కూటమి సారథ్య బాధ్యతలు మమతా బెనర్జీకి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్న వేళ నేషనల్ కాన్ఫరెన్స్ ఆచితూచి అడుగులేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిత్రపక్షాల భేటీనే జరగలేదని, అలాంటప్పుడు నాయకత్వ మార్పుపై ఎవరు చర్చించారని JK CM ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. సమావేశం నిర్వహించినప్పుడు మమత సారథ్య బాధ్యతలు కోరవచ్చని, అప్పుడే ఈ విషయంపై చర్చ జరుగుతుందన్నారు.
News December 9, 2024
నాగబాబుకు మంత్రి పదవి
AP: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన నేత నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది.