News September 24, 2024
అంబానీ కొత్త విమానం.. కదిలే ఇంద్రభవనమే!
బిలియనీర్ ముకేశ్ అంబానీ ‘బోయింగ్ 737 మ్యాక్స్ 9’ విమానం కొన్నారు. దీని విలువ సుమారు రూ.1,000 కోట్లు. ఈ విమానం గంటకు 838 కి.మీ వేగంతో నాన్ స్టాప్‌గా 11,770 కి.మీ ప్రయాణిస్తుంది. ఇందులో ముకేశ్ అభిరుచులకు తగ్గట్లు సకల సౌకర్యాలు ఉండేలా స్విట్జర్లాండ్‌లో రీ మోడల్ చేయించారు. త్వరలోనే ఈ విమానాన్ని ముంబైకి తీసుకువస్తారు. ఇప్పటికే ముకేశ్ వద్ద 9 ప్రైవేట్ జెట్లు ఉండగా ఈ కొత్తదానితో వాటి సంఖ్య 10కి చేరింది.
Similar News
News October 7, 2024
భారత యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా భారత యువతి పూజను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు పూజ ఇస్లాం మతాన్ని స్వీకరించనున్నట్లు రజా తెలిపారు. కాగా 32 ఏళ్ల హసన్ రజా పాక్ తరఫున ఒక వన్డే, 10 టీ20లు ఆడారు. అనంతరం ఆయన యూఎస్‌లో స్థిరపడ్డారు. పూజ ఫ్యామిలీ కూడా అక్కడే స్థిరపడింది.
News October 7, 2024
గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ ఆందోళన
INDvBAN టీ20 మ్యాచ్ జరిగిన గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ కార్యకర్తలు నల్ల జెండాలతో ఆందోళన చేశారు. బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతుంటే, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటంటూ నినాదాలు చేశారు. మ్యాచ్ దృష్ట్యా ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయరాదంటూ స్థానిక జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ నిరసనకారులు లెక్కచేయకపోవడం గమనార్హం. వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
News October 7, 2024
రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు
TG: గుండెపోటుకు గురైనా ఆర్టీసీ డ్రైవర్ విధి నిర్వహణను మరువలేదు. 45 మంది ప్రాణాలను కాపాడి, ఆయన తనువు చాలించారు. హుజూరాబాద్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా గజ్వేల్ వద్దకు రాగానే డ్రైవర్ రమేశ్ సింగ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆయన బస్సును సురక్షితంగా పక్కకు నిలిపి, కుప్పకూలిపోయారు. ప్రయాణికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు.