News November 4, 2024
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అంబటి సెటైర్లు
AP: రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై స్పందిస్తూ తాను హోం మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘హోం మినిస్ట్రీ తీసుకుని ప్రతాపం చూపండి. స్వామి ఆదిత్యనాథ్ అవుతారో? కిల్ బిల్ పాండే అవుతారో? కాలమే నిర్ణయిస్తుంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 8, 2024
రేపు, ఎల్లుండి పింఛన్ల తనిఖీ
AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది. తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు, ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించనుంది. ఒక్కో బృందం 40 పింఛన్లను పరిశీలిస్తుంది.
News December 8, 2024
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురిసింది. TGలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 10 నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ తదితర జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి.
News December 8, 2024
ఏప్రిల్ నుంచి రాజమౌళి-మహేశ్ సినిమా షురూ?
రాజమౌళి- మహేశ్ బాబు కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం లొకేషన్లు, నటీనటుల ఎంపికలో దర్శకధీరుడు బిజీగా ఉన్నారు. ఏప్రిల్ మూడో వారం తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.