News February 17, 2025
‘తుని’లో అమీతుమీ

AP: ఇవాళ తుని మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్-2 ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. TDP-YCP శ్రేణులు రోడ్లపైకి రావడంతో గందరగోళం నెలకొంది. 2021 ఎన్నికల్లో 30 వార్డులను YCP క్లీన్‌స్వీప్ చేసింది. ఇటీవల 10మంది సభ్యులను చేర్చుకున్న TDP.. MLA దివ్య ఓటు సాయంతో పదవిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అలాగే పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్, పాలకొండ మున్సిపల్ ఛైర్మన్ పదవులకూ నేడు ఎన్నిక జరగాల్సి ఉంది.
Similar News
News April 17, 2026
ఉమెన్ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకెందుకు: థరూర్

మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా LSలో ప్రస్తుత సభ్యుల సంఖ్యను అనుసరించి అమలు చేయాలని INC MP శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘డీలిమిటేషన్ తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు. LS సభ్యుల సంఖ్యను 850కి పెంచడం ప్రపంచంలో గొప్పదంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 123 రోజులు జరిగితే ఇప్పుడు 60డేస్‌కు కుదించారు’ అని విమర్శించారు.
News April 17, 2026
ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.
News April 17, 2026
జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

YCP చీఫ్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ మధ్య 2 వారాలు యూరప్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కావాలంది. పర్యటన వివరాలు కోర్టు, CBIకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


