News August 14, 2024
ఇజ్రాయెల్‌కు $20 బిలియన్ల ఆయుధాలను విక్రయించిన అమెరికా
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్‌కు 20 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా విక్రయించింది. ఇందులో 33 వేల ట్యాంక్ క్యాట్రిడ్జ్‌లు, 50 వేల మోర్టార్ క్యాట్రిడ్జ్‌లు, 50 ఎఫ్-15 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఈ ఆయుధాలను 2029 నాటికి ఇజ్రాయెల్‌కు అందించనుంది. కాగా వీటి పంపిణీని ఆపాలని మానవతావాదులు ఒత్తిడి చేస్తున్నా అమెరికా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.
Similar News
News September 18, 2024
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
AP: నూతన మద్యం విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర క్వార్టర్‌కు రూ.99 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు మన్యం దొర అల్లూరి సీతారామరాజు పేరును పెట్టాలని నిర్ణయించారు.
News September 18, 2024
రాత్రికి రాత్రి మెడికల్ కాలేజీలు కట్టలేం: విడదల రజినీ
AP: రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, ఐదేళ్లలో ఐదు పూర్తి చేశామని మాజీ మంత్రి విడదల రజినీ తెలిపారు. రాత్రికి రాత్రే అన్ని కళాశాలలను కట్టలేమని ఆమె చెప్పారు. ‘వందేళ్లలో కేవలం 11 కాలేజీలే కట్టారు. అలాంటిది ఐదేళ్లలోనే ఐదు కట్టాం. మరో ఐదు కాలేజీలు నిర్మాణదశలో ఉన్నాయి. మిగతా కళాశాలలను కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలి. సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు.
News September 18, 2024
ఏపీ, తెలంగాణకు ట్రైనీ ఐపీఎస్‌ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు దీక్ష(హరియాణా), బొడ్డు హేమంత్(ఏపీ), మనీషా వంగల రెడ్డి(ఏపీ), సుష్మిత(తమిళనాడు), తెలంగాణకు మనన్ భట్(జమ్ముూకశ్మీర్), రుత్విక్ సాయి(TG), సాయి కిరణ్(TG), యాదవ్ వసుంధర(UP)ను కేంద్రం కేటాయించింది.