News February 18, 2025

సిక్కుల తలపాగాలు తీయించిన అమెరికా?

image

అక్రమ వలసదారుల్ని అమెరికా భారత్‌కు పంపించేస్తున్న సంగతి తెలిసిందే. తొలి విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజా విమానంలో సిక్కుల తలపాగాలను తీయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 116మంది వలసదారులతో కూడిన విమానం నిన్న అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఎలాగూ వెనక్కి పంపిస్తున్న అమెరికా, ఇలాంటి పనులు చేయడమేంటంటూ వలసదారులు మండిపడుతున్నారు.

Similar News

News April 15, 2026

ముసలావిడే కానీ మహానుభావురాలు!

image

40ఏళ్లు దాటేసరికే జీవితం అయిపోయిందని చాలా మంది నిరుత్సాహపడుతున్న రోజులివి. కానీ కొత్త గమ్యాలకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ప్రభావతి భగవతి అనే 98ఏళ్ల బామ్మ. 2017లో భర్త చనిపోవడం, పిల్లలు దూరంగా ఉండటంతో ఒంటరితనాన్ని జయించేందుకు ఇతరుల ప్రోత్సాహంతో 2018లో ‘నానీస్ నాశ్తా’ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 200కుపైగా కుటుంబాలకు గుజరాతీ, మహారాష్ట్ర వంటకాలను అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

News April 15, 2026

CBSE టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్

image

CBSE టెన్త్ క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యార్థులు <<-1>>వెబ్‌సైట్‌లో<<>> రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 మధ్య ఎగ్జామ్స్ జరగగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి. ఇక 12వ తరగతి రిజల్ట్స్ వచ్చే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.