News November 4, 2024
అమెరికా ఎలక్షన్స్.. రూ.కోట్లల్లో బెట్టింగ్!
మన దగ్గర సర్పంచ్, ఎమ్మెల్యే ఎలక్షన్లకే జోరుగా బెట్టింగ్ జరుగుతుంటుంది. అలాంటిది ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను వదిలేస్తారా? సర్వేలను నమ్మి మిలియన్ డాలర్లను బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌పోస్ట్ అమెరికా ప్రకారం US ప్రెసిడెన్షియల్ ఎన్నికలపై కొన్ని చట్టపరమైన ప్లాట్‌ఫామ్‌లలో $100M (రూ.830 కోట్లు) పైగా పందెం వేసినట్లు పేర్కొంది. అనధికారికంగా ఇంకెంత జరిగి ఉంటుందో?
Similar News
News December 9, 2024
తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి: KTR
TG: కాంగ్రెస్ పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోంది. మొన్న ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ మాయమైపోయాయి. తెలంగాణ తల్లి అని చెప్పి సీఎం బిల్డప్ ఇస్తున్నారు. ఆ విగ్రహంలో బతుకమ్మ మాయమైంది. విగ్రహ రూపంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి’ అని కేటీఆర్ విమర్శించారు.
News December 9, 2024
విషాదం.. విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో గడుగుపల్లిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. ఇంటిపైన బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్ష్మి(36)తో సహా కుమారుడు సంతోష్(13), కూతురు అంజలి(10) మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
News December 9, 2024
సివిల్స్ ఫలితాలు విడుదల
సివిల్స్-2024 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి జాబితాను UPSC రిలీజ్ చేసింది. ఇక్కడ <