News November 12, 2024

అమెరికా NSAగా ఇండియా ఫ్రెండ్.. చైనాకు విరోధి!

image

భారత్ అనుకూల వ్యక్తులకు డొనాల్డ్ ట్రంప్ పెద్దపీట వేస్తున్నారు. ఇండియా కాకస్ కో‌ఛైర్మన్‌ మైక్ వాల్జ్‌ను NSAగా ఎంపిక చేశారని తెలిసింది. ఈ రిటైర్డ్ ఆర్మీ కల్నల్‌కు చైనా పొడ అస్సలు గిట్టదు. రిపబ్లికన్ చైనా టాస్క్‌ఫోర్స్‌లోనూ ఆయన సభ్యుడు. ఒకవేళ ఇండో పసిఫిక్ ప్రాంతంలో వివాదం ఏర్పడితే US మిలిటరీ సన్నద్ధంగా లేదని బాహాటంగానే చెప్పారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు ఎక్కువ, అమెరికా తక్కువ సాయం చేయాలని సూచించారు.

Similar News

News December 6, 2024

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

image

తెలంగాణకు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలు, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం ప్రకటించింది. TGలోని జగిత్యాల, NZB, కొత్తగూడెం, మేడ్చల్, MBNR, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు నవోదయ విద్యాలయాలను కేటాయించింది. ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులో వలసపల్లె, సత్యసాయి జిల్లాలో పాలసముద్రం, గుంటూరులో తాళ్లపల్లె, రొంపిచర్ల, కృష్ణాలో నూజివీడు, నందిగామ, నంద్యాలలోని డోన్‌లో KVBల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

News December 6, 2024

ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత కుమార్తెతో కొడుకు పెళ్లి.. సీనియర్ లీడర్ సస్పెండ్

image

కొడుకు పెళ్లి పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యం కిందికి వ‌స్తుంద‌ని ఆ BSP నేత ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ అదే జరిగింది. UPలోని రాంపూర్ జిల్లా BSP నేత సురేంద్ర సాగ‌ర్ త‌న కుమారుడి పెళ్లి SP MLA త్రిభువ‌న్ ద‌త్ కుమార్తెతో చేశారు. దీంతో ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌తో సంబంధం కుదుర్చుకున్నందుకు సీనియర్ నేత అని కూడా చూడకుండా సురేంద్రతోపాటు పార్టీ జిల్లా అధ్య‌క్షుడిని కూడా చీఫ్ మాయావ‌తి స‌స్పెండ్ చేశారు.

News December 6, 2024

రేపు నటి, నటుడి పెళ్లి

image

తెలుగు నటుడు సాయి కిరణ్ 46 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకోబోతున్నారు. సీరియల్ నటి స్రవంతితో రేపు ఆయన పెళ్లి జరగనుంది. ‘నువ్వే కావాలి’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ పలు సినిమాల్లో హీరోగా, సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. సాయి కిరణ్ తొలి వివాహం 2010లో వైష్ణవి అనే మహిళతో జరిగింది. వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వారికి ఒక కూతురు ఉంది.