News September 8, 2024
ఏలియన్స్పై అమెరికా అధ్యయనం: మాజీ అధికారి

అమెరికా రక్షణ కార్యాలయంలో పనిచేసిన లూయిస్ ఎలిజోండో అనే అధికారి సంచలన ప్రకటన చేశారు. తమకు చిక్కిన గ్రహాంతరవాసులు, వారి నౌకపై అమెరికా అధ్యయనం చేసిందని వెల్లడించారు. ‘గ్రహాంతరవాసులు, వారి వాహనాలపై అమెరికా పరిశోధనలు జరిపింది. వాటి ఉనికి గురించి దశాబ్దాల క్రితమే తెలిసినా రహస్యంగా ఉంచుతోంది. విశ్వంలో మనం ఒంటరి కాదు’ అని పేర్కొన్నారు. కాగా.. లూయిస్ ఆరోపణలు నిరాధారమైనవంటూ అమెరికా ఖండించింది.
Similar News
News October 24, 2025
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియాలో మేనేజర్ పోస్టులు… అప్లై చేశారా?

ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా( EPI) లిమిటెడ్లో 18 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 29 ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.50వేలు, HRA చెల్లిస్తారు. వెబ్సైట్: https://epi.gov.in/
News October 24, 2025
భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఏపీలోని గుంటూరు, విజయవాడతో పాటు పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అనకాపల్లి, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వానలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అటు దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు.
News October 24, 2025
బస్సు ప్రమాదంలో 13మంది తెలంగాణవాసులు!

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన చోటుకు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్, SP చేరుకున్నారు. ‘బస్సులో 13 మంది తెలంగాణవాసులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఏడుగురికి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురు HYD, ఖమ్మం, RR, సంగారెడ్డికి చెందినవారిగా గుర్తించాం. మిగిలిన ఆరుగురు చనిపోయారా, బతికున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది’ అని అన్నారు. హెల్ప్ లైన్ నంబర్స్: 9912919545, 9440854433.


