News September 8, 2024
ఏలియన్స్‌పై అమెరికా అధ్యయనం: మాజీ అధికారి
అమెరికా రక్షణ కార్యాలయంలో పనిచేసిన లూయిస్ ఎలిజోండో అనే అధికారి సంచలన ప్రకటన చేశారు. తమకు చిక్కిన గ్రహాంతరవాసులు, వారి నౌకపై అమెరికా అధ్యయనం చేసిందని వెల్లడించారు. ‘గ్రహాంతరవాసులు, వారి వాహనాలపై అమెరికా పరిశోధనలు జరిపింది. వాటి ఉనికి గురించి దశాబ్దాల క్రితమే తెలిసినా రహస్యంగా ఉంచుతోంది. విశ్వంలో మనం ఒంటరి కాదు’ అని పేర్కొన్నారు. కాగా.. లూయిస్ ఆరోపణలు నిరాధారమైనవంటూ అమెరికా ఖండించింది.
Similar News
News October 9, 2024
రతన్ టాటా ఆరోగ్యం విషమం?
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా(86) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నారని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. తన ఆరోగ్యం బాగుందంటూ టాటా 2 రోజుల క్రితమే స్పష్టతనిచ్చారు. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అవే వార్తలు రావడం గమనార్హం.
News October 9, 2024
BREAKING: నారా లోకేశ్ బిగ్ అనౌన్స్‌మెంట్
AP: విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లిమిటెడ్ కంపెనీ రాబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీని ద్వారా 10వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. దేశంలో వ్యాపారం చేసేందుకు ఏపీని నంబర్-1గా తీర్చిదిద్దడంలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. కాగా నిన్న బిగ్ <<14307324>>అనౌన్స్‌మెంట్<<>> ఉండబోతున్నట్లు లోకేశ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
News October 9, 2024
రైతుబంధు నిధులు నొక్కేసిన తహశీల్దార్ అరెస్టు
TG: అక్రమంగా రైతుబంధు నిధులను పొందిన నల్గొండ జిల్లా అనుముల తహశీల్దార్ జయశ్రీని పోలీసులు అరెస్టు చేశారు. 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రూ.14.63 లక్షల రైతుబంధు సొమ్మును స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ధరణి ఆపరేటర్ జగదీశ్ బంధువుల పేరిట 2019లో జయశ్రీ పాస్ బుక్ జారీ చేశారు. జయశ్రీ, జగదీశ్, పట్టాదారులు రైతుబంధు నిధులను సగం సగం పంచుకున్నారు.