News October 2, 2024
ఇజ్రాయెల్‌కు అమెరికా సపోర్ట్.. కారణాలివే!
చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉంటోంది. 1948లో తొలిసారిగా ఇజ్రాయెల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించింది అమెరికానే. 1967లో పశ్చిమాసియాపై రష్యా ఆధిపత్యం పెరిగిపోకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో అమెరికా దృష్టిని ఇజ్రాయెల్ ఆకర్షించింది. మిడిల్ ఈస్ట్‌పై పట్టుకు ఇజ్రాయెల్ తమకు ఉపయోగపడుతుందని స్నేహబంధం కొనసాగిస్తూ వస్తోంది. అలాగే అమెరికాలో యూధులు రాజకీయంగా చాలా ప్రభావం చూపగలరు.
Similar News
News October 13, 2024
త్వరలో మరో పార్టీలో చేరుతా: రాపాక
AP: వైసీపీని వీడనున్నట్లు రాజోలు మాజీ ఎమ్మెల్యే <<14347126>>రాపాక<<>> వరప్రసాద్ తెలిపారు. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. ‘గతంలో పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నూరు శాతం నిర్వహించా. అయినా ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేదు. TDP నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చారు. ఇప్పుడు ఆయననే ఇన్‌ఛార్జ్‌గానూ నియమించారు. ఇష్టం లేకపోయినా MPగా పోటీ చేశా. త్వరలో మరో పార్టీలో చేరుతా’ అని మీడియాకు వెల్లడించారు.
News October 13, 2024
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్!
ఈ దీపావళికి దేశీయ మార్గాల్లో విమాన టికెట్ల ధరలు సగటున 20-25% తగ్గినట్టు పలు సంస్థలు చెబుతున్నాయి. 30 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌పై వన్ వేలో ఈ సగటు తగ్గింపు ధరలు వర్తిస్తున్నాయి. పెరిగిన విమానాల సంఖ్య, ఇంధన ధరల తగ్గింపు వల్ల ధరలు దిగొచ్చినట్టు అంచనా వేస్తున్నాయి. HYD-ఢిల్లీ మార్గాల్లో 32% ధరలు తగ్గినట్టు విశ్లేషిస్తున్నాయి. గత ఏడాది కంటే ధరలు తగ్గినట్టు సంస్థలు పేర్కొన్నాయి.
News October 13, 2024
బాబర్‌ను తప్పిస్తారా..? భారత్‌ను చూసి నేర్చుకోండి: పాక్ క్రికెటర్
ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టులకు బాబర్ ఆజమ్‌ను పాక్ క్రికెట్ బోర్డు తప్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆ దేశ ఆటగాడు ఫఖార్ జమాన్ ట్విటర్లో మండిపడ్డారు. ‘బాబర్‌ను తప్పించడమేంటి? 2020-23 మధ్యకాలంలో విరాట్ సగటు ఎంత తక్కువగా ఉన్నా భారత్ అతడిని తప్పించలేదు. మన దేశంలోనే అత్యుత్తమ బ్యాటరైన బాబర్‌ను తప్పించడం జట్టుకు తప్పుడు సంకేతాల్నిస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.