News January 16, 2025
ఎల్లుండి ఏపీ పర్యటనకు అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 18న ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకొని అదే రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసంలో విందుకు హాజరవుతారు. అనంతరం విజయవాడ హోటల్లో బస చేస్తారు. 19న ఉదయం కొండపావులూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్తో పాటు NDRF పదో బెటాలియన్ ప్రాంగణాలను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్తారు.
Similar News
News November 23, 2025
సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.
News November 23, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.oil-india.com/
News November 23, 2025
మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు

మిరియాలు ప్రతి వంటింట్లో కచ్చితంగా ఉంటాయి. వీటివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడం, క్యాన్సర్ నివారణ, డయాబెటీస్ కంట్రోల్లో ఉంచడం, గుండె ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అయితే కడుపులో మంట ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.


