News January 16, 2025
ఎల్లుండి ఏపీ పర్యటనకు అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 18న ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకొని అదే రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసంలో విందుకు హాజరవుతారు. అనంతరం విజయవాడ హోటల్‌లో బస చేస్తారు. 19న ఉదయం కొండపావులూరులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్‌తో పాటు NDRF పదో బెటాలియన్ ప్రాంగణాలను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్తారు.
Similar News
News February 9, 2025
బెంగళూరులో మెట్రో ఛార్జీలు 50% పెంపు!

బెంగళూరులో మెట్రో ట్రైన్ ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధర కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.90గా ఉంది. గరిష్ఠ టికెట్ ధరను రూ.60 నుంచి రూ.90కి పెంచారు. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి రానుంది. 0-2kmsకి రూ.10, 2-4kmsకి 20, 6-8kms 40, 8-10kms 50, 20-25kms 80, 25-30kmsకి 90 ఛార్జ్ చేస్తారు. స్మార్ట్ కార్డులపై 5% డిస్కౌంట్‌ను కొనసాగించనున్నారు. కాగా ఇటీవల కర్ణాటకలో ఆర్టీసీ ఛార్జీలను 15% పెంచిన సంగతి తెలిసిందే.
News February 9, 2025
రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు: ఈసీ

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఈసీ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.
News February 9, 2025
ఫోన్ స్క్రీన్ టైమ్ ఇలా తగ్గించుకోండి!

* అనవసరమైన యాప్‌ల నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి.
* 30minకి ఒకసారి స్క్రీన్ బ్రేక్ తీసుకోండి. వారంలో ఒక రోజు ఫోన్ వాడకండి.
* బుక్స్ చదవడం, వ్యాయామం, పెయింటింగ్ వంటివి చేయండి
* బాత్రూమ్, బెడ్ రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్లొద్దు
* ఫోన్ వాడకాన్ని తగ్గిస్తున్నట్లు మీ ఫ్రెండ్స్‌కు చెప్పండి. మెసేజ్‌లకు లేట్‌గా రిప్లై ఇచ్చినా ఏం కాదు
* ఫోన్ ఎక్కువగా వాడొద్దన్న విషయాన్ని పదే పదే గుర్తుచేసుకోండి.