News May 11, 2024

నేడు రాష్ట్రానికి అమిత్ షా రాక

image

TG: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు చేవెళ్ల పార్లమెంట్ ఫరిధిలోని వికారాబాద్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఫరిధిలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Similar News

News February 5, 2026

WPL ఫైనల్: టాస్ గెలిచిన RCB

image

WPL ఫైనల్ 2026లో ఢిల్లీతో జరిగే మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ: లీ, షఫాలీ వర్మ, లారా, రోడ్రిగ్స్, కాప్, హెన్రీ, నికి ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను, శ్రీ చరణి, నందని శర్మ
బెంగళూరు: గ్రేస్ హారిస్, స్మృతి మందాన, జార్జియా, రిచా ఘోష్, రాధా యాదవ్, డి క్లర్క్, పూజ, అరుంధతి రెడ్డి, సయాలీ, శ్రేయాంక, లారెన్ బెల్.

News February 5, 2026

జాబ్ క్యాలెండర్ కాదు స్కామ్ క్యాలెండర్: హరీశ్

image

TG: సీఎం రేవంత్ గతేడాది ప్రతినెలా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, నెలకు ఒక స్కామ్ చేశారని హరీశ్ రావు విమర్శించారు. జనవరిలో సివిల్ సప్లైస్, FEBలో ఎన్టీపీసీ ఫ్లై యాష్, మార్చిలో సాండ్, APRలో ఆర్టీసీ, మేలో అమృత్ టెండర్లు, జూన్‌లో ఫోర్త్ సిటీ, జులైలో లగచర్ల ల్యాండ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్లు, సెప్టెంబర్‌లో HILTP, అక్టోబర్‌లో విద్యుత్, NOVలో సింగరేణి, డిసెంబర్‌లో KLSR స్కామ్ చేశారని ఆరోపించారు.

News February 5, 2026

భర్తకు ఎడమవైపునే భార్య.. ఎందుకంటే?

image

హిందూ సంప్రదాయంలో భార్యను భర్తకు ఎడమ వైపున ఉండాలని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం. పురాణాల ప్రకారం పరమశివుని శరీరంలో ఎడమ భాగం పార్వతీదేవి ఉంటారు. దీంతోపాటు గుండె ఎడమ వైపున ఉండటంతో భార్య భర్త మనసుకి దగ్గరగా ఉండాలని దీని అంతరార్థం. అందుకే పూజలు, శుభకార్యాల్లో భార్య భర్తకు ఎడమ వైపునే కూర్చుని ధర్మకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.