News May 11, 2024

నేడు రాష్ట్రానికి అమిత్ షా రాక

image

TG: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు చేవెళ్ల పార్లమెంట్ ఫరిధిలోని వికారాబాద్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఫరిధిలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Similar News

News January 18, 2026

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశం

image

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు వెనుకబడిన జిల్లాను BRSపాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని పట్టణ ప్రజలకు వివరించాలని సూచించారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సమిష్టిగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

News January 18, 2026

నేటి నుంచి నాగోబా జాతర

image

TG: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్(D) కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్య సందర్భంగా ఇవాళ 10pmకు మహాపూజలతో అంకురార్పణ చేయనున్నారు. మెస్రం వంశీయులు మంచిర్యాల(D)లోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర ప్రారంభం అవుతుంది. 22న గిరిజన దర్బార్, 25వ తేదీతో జాతర ముగియనుంది.

News January 18, 2026

దానిమ్మలో ‘భగవా’ రకం ప్రత్యేకం

image

దానిమ్మలో చీడపీడల బెడద ఎక్కువ. అందుకే ఈ పంటను చాలా జాగ్రత్తగా సాగు చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన భగవా దానిమ్మ రకం ప్రత్యేకమైనది. కాయ సైజు పెద్దగా ఆకర్షణీయమైన కుంకుమ రంగులో ఉండటంతో పాటు రుచి చాలా తియ్యగా ఉంటుంది. దీనిపైన తొక్క కూడా మందంగా ఉంటుంది. ఇతర రకాలతో పోలిస్తే భగవా రకం పండ్లు చీడపీడలు, తెగుళ్లను తట్టుకొని మచ్చలకు తక్కువగా గురవుతాయి. మార్కెట్‌లో ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది.