News August 14, 2024
దేశ విభజన బాధితులకు అమిత్ షా నివాళి
చరిత్రను గుర్తుపెట్టుకున్న దేశమే భవిష్యత్తును నిర్మించుకొని శక్తిమంతంగా ఎదుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆగస్టు 14, దేశ విభజన గాయాల స్మృతి దినం నేపథ్యంలో ట్వీట్ చేశారు. ‘మన చరిత్రలోనే దారుణమైన రోజు ఇది. దేశ విభజనతో ప్రాణాలు, ఇళ్లు, ఆస్తులు, ఆప్తులను కోల్పోయిన లక్షల మందికి ఇదే నా నివాళి. మోదీ నాయకత్వంలో జాతి నిర్మాణం కోసమే ఈ స్మృతి దినాన్ని నిర్వహిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 15, 2024
కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
TG: ఎమ్మెల్యేల పార్టీ మార్పు <<14105126>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందని అన్నారు. గాంధీనే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలని కేటీఆర్‌కు హితవు పలికారు. ఎవరెన్ని చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో తగ్గదన్నారు.
News September 15, 2024
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొట్టనున్నాం: షమీ
ఆస్ట్రేలియాపై BGT సిరీస్‌లో భారత్ హ్యాట్రిక్ కొట్టనుందని టీమ్ ఇండియా బౌలర్ షమీ జోస్యం చెప్పారు. ‘ఇండియాయే ఫేవరెట్. అందులో డౌట్ లేదు. ప్రత్యర్థి ఆసీస్ కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుంది. కానీ గెలుస్తాం’ అని పేర్కొన్నారు. కమ్ బ్యాక్ విషయంలో తాను కంగారు పడటం లేదని తెలిపారు. ‘పూర్తిగా బలం పుంజుకున్న తర్వాత గ్రౌండ్‌లో అడుగుపెట్టాలి. లేదంటే మళ్లీ ఇబ్బంది పడాలి. ఎంత ఫిట్ అయితే అంత మంచిది’ అని వివరించారు.
News September 15, 2024
ఏడాదికి ఓసారైనా ఈ పరీక్షలు చేయించండి
ఎంత ఆరోగ్యవంతులైనా ఏడాదికి కనీసం ఒక్కసారైనా కొన్ని టెస్టులు చేయించాలంటున్నారు అపోలో వైద్యుడు డా. సుధీర్ కుమార్. షుగర్, బీపీ టెస్టులే కాకుండా ఎకోకార్డియోగ్రామ్, హీమోగ్లోబిన్, ఈసీజీ, యూరిక్ యాసిడ్, విటమిన్ డీ-బి12, ట్రెడ్‌మిల్ టెస్ట్, క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ టెస్ట్, చెస్ట్ ఎక్స్‌రే సహా 20 టెస్టుల్ని చేయిస్తే ముందుగానే పెను సమస్యల్ని గుర్తించొచ్చని ఆయన ట్విటర్‌లో వివరించారు.