News November 21, 2024

కొడుకు కాపురంపై స్పందించిన అమితాబ్

image

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్‌ వైవాహిక జీవితం సరిగా లేదంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిపై అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో పరోక్షంగా స్పందించారు. ‘ఊహాగానాలెప్పుడూ ఊహాగానాలే. అవాస్తవాలే. వాటికి ఎటువంటి ఆధారాలు ఉండవు. ధ్రువీకరణ కాని సమాచారాన్ని ప్రశ్నార్థకం పెట్టి రాసేస్తుంటారు. అది ఎవరి గురించైతే రాశారో వారి జీవితంపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో పట్టించుకోరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News December 8, 2024

కాంగ్రెస్ హామీల అమలుపై నిలదీస్తాం: కేటీఆర్

image

TG: హామీల అమలు విషయంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై ప్రశ్నిస్తామని చెప్పారు. గిరిజన, దళిత రైతుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంపై ప్రభుత్వం చేస్తున్న దాడిని ఎండగడతామని పేర్కొన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ 420 హామీలను నిలదీస్తామని తెలిపారు.

News December 8, 2024

అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతాన్ని అనుకొని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోందని APSDMA ట్వీట్ చేసింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది.

News December 8, 2024

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: KCR

image

TG: ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని KCR ధ్వజమెత్తారు. గురుకులాలు, విద్యారంగం, మూసీ, హైడ్రా, నిర్భంద పాలనపై BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎండగట్టాలని సూచించారు. ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని నిలదీస్తామని చెప్పారు. మార్చిలో BRSలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని వివరించారు గులాబీ దళపతి.