News July 11, 2024
‘అమ్మకు వందనం’ రూ.15,000.. ఇది తప్పనిసరి

AP: అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరని లేని పక్షంలో ఆధార్ కోసం నమోదు చేసుకుని ఉండాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ వచ్చేవరకు పాన్ కార్డు, పాస్ పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 10 ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలంది. అమ్మకు వందనం కింద విద్యార్థుల సంరక్షకులకు రూ.15వేలు, స్టూడెంట్ కిట్‌లో బ్యాగ్, దుస్తులు తదితరాలు అందిస్తోంది.
Similar News
News February 16, 2025
రూ.62కోట్ల నష్టం తెచ్చిపెట్టిన ఎక్స్‌ప్రెస్

సాధారణంగా రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. సీటు దొరకడమే కష్టం. అయితే ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. గత మూడేళ్లుగా ఈ ట్రైన్ వల్ల రైల్వేశాఖకు రూ.62.88 కోట్ల నష్టం వచ్చింది. దీంతో దీని నిర్వహణ బాధ్యతను రైల్వే IRCTCకి అప్పగించింది. అయినప్పటికీ తగినంతగా ప్యాసింజర్‌లు లేక నష్టాల మార్గంలో ప్రయాణిస్తోంది.
News February 16, 2025
వల్లభనేని వంశీ అంటేనే అరాచకం : మంత్రి నిమ్మల

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం అవినీతికి మారుపేరని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వంశీని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి అని మండిపడ్డారు. ‘దేశంలో ఎక్కడా ఏ పార్టీ ఆఫీస్‌లపై దాడి జరగలేదు. కానీ టీడీపీ ఆఫీస్‌పై వంశీ దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు చేసిన దళితుడిని కిడ్నాప్ చేసిన ఘనుడు. 11 సీట్లు ఇచ్చినా వైసీపీ నేతలు, జగన్‌కు ఇంకా బుద్ధి రాలేదు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 16, 2025
న్యాయమూర్తులను ఏరేస్తున్న ట్రంప్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. దీంతో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పలువురు కోర్టులలో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘తన దేశాన్ని కాపాడుకొనే వ్యక్తి ఎన్నటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు’ అనే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.