News April 27, 2024
అమ్మఒడి నగదు రూ.17వేలకు పెంచుతాం: సీఎం

AP: అమ్మఒడి పథకం కింద ఇచ్చే నగదును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో స్కూల్ బాగోగుల కోసం రూ.2 వేలు కేటాయించి, మిగతా రూ.15 వేలను తల్లుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. వైఎస్ఆర్ చేయూత కొనసాగిస్తామని.. ఐదేళ్లలో రూ.1,50,000 వరకు పెంచుతామన్నారు. కాపునేస్తాన్ని రూ.1,20,000 వరకు, ఈబీసీ నేస్తం రూ.లక్షా ఐదు వేల వరకు పెంచుతామని ప్రకటించారు.
Similar News
News July 11, 2025
BJP రామచంద్రా.. భద్రాద్రిని కాపాడండి: కేటీఆర్

AP రాష్ట్రం పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచలం రాములోరి భూములను ఆక్రమించుకుంటుంటే BJP రామచంద్రా నోరు తెరవరేం అని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును మాజీ మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శించారు. తమ భాగస్వామ్య ప్రభుత్వం చేరలో ఉన్నామని వదిలేస్తున్నారా అని మండిపడ్డారు. ప్రధాని మోదీతో మాట్లాడతారో లేదా మీ దోస్తు(చంద్రబాబు నాయుడు) దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం.. ఆక్రమణల చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.