News November 6, 2024
బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి
AP: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్-ఛైర్మన్, ఎండీగా ఐఏఎస్ ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఆమ్రపాలి ఏపీకి వచ్చి రిపోర్ట్ చేశారు. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆమె విద్యాభ్యాసం విశాఖలో సాగింది. 2010లో ఆమె IASకు సెలెక్ట్ అయ్యారు.
Similar News
News December 11, 2024
2035కల్లా అంతరిక్ష కేంద్రం పూర్తి: కేంద్ర మంత్రి
సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని 2035 కల్లా పూర్తి చేస్తామని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం తెలిపారు. 2040కల్లా భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపుతామన్నారు. ‘మన అంతరిక్ష కేంద్రాన్ని భారతీయ అంతరిక్ష స్టేషన్‌గా పిలుస్తాం. వచ్చే ఏడాది చివరినాటికి గగన్‌యాన్ ద్వారా వ్యోమగామిని రోదసిలోకి పంపిస్తాం. ఇక సముద్రం అడుగున 6వేల మీటర్ల లోతున కూడా పరిశోధనలు చేస్తాం’ అని తెలిపారు.
News December 11, 2024
మన ఆటగాళ్లు వెనక్కి తగ్గాల్సిన పనే లేదు: రవిశాస్త్రి
సిరాజ్, హెడ్ మధ్య జరిగిన గొడవపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘సిక్స్ కొట్టించుకున్న ఫాస్ట్ బౌలర్ వికెట్ తీశాక సిరాజ్‌లా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేం లేదు. అవతలి వాళ్లు ఒకటి అంటే మనం రెండు అనాలి. వెనక్కి తగ్గాల్సిన పనేలేదు. భారత కోచ్‌గా ఉన్నప్పుడూ ఆటగాళ్లకు అదే చెప్పాను. పరిస్థితిని మరింత దిగజారనివ్వని పరిపక్వత హెడ్, సిరాజ్‌కు ఉంది కాబట్టి సమస్య లేదు’ అని పేర్కొన్నారు.
News December 11, 2024
‘పుష్ప-2’ అద్భుతం: వెంకటేశ్
‘పుష్ప-2’ సినిమాపై విక్టరీ వెంకటేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘అల్లు అర్జున్ అద్భుతమైన ప్రదర్శన స్క్రీన్‌పై నుంచి నా దృష్టిని మరల్చనివ్వలేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది. రష్మిక నటన, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అద్భుతం. పుష్ప-2 సూపర్ సక్సెస్ అయినందున డైరెక్టర్ సుకుమార్‌కి, చిత్రయూనిట్‌కు అభినందనలు’ అని వెంకీ ట్వీట్ చేశారు.