News July 17, 2024
వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: జీవన్ రెడ్డి
TG: విదేశాల్లో మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం రేవంత్‌కు MLC జీవన్ రెడ్డి లేఖ రాశారు. దీంతో పాటు రాష్ట్రానికి వచ్చి స్థిరపడే వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉపాధికి గల్ఫ్ వెళ్లే వారి నుంచి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోందన్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభం లేదని, అలాంటి వారికి సహాయ పడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.
Similar News
News December 12, 2024
రేవంత్.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?: KTR
TG: అర్ధసత్యాలు, అభూత కల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని CM రేవంత్‌ని KTR ప్రశ్నించారు. ‘మీ మాటలు అబద్ధం, మీ చేతలు అబద్ధం. కాకిలెక్కలతో మోసగించడమే మీ విధానమా? రూ.50-65వేల కోట్ల వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరికోసం? ఢిల్లీకి మూటలు మోసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగీ, లాగు వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?’ అని ఫైర్ అయ్యారు.
News December 12, 2024
వారిపై చట్టపరమైన చర్యలు: సాయిపల్లవి
తనపై వస్తోన్న రూమర్స్‌పై హీరోయిన్ సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తన మౌనాన్ని అవకాశంగా తీసుకోవద్దని ట్వీట్ చేశారు. కాగా ‘రామాయణ’లో సీత పాత్ర చేసేందుకు సాయిపల్లవి తన అలవాట్లు, పద్ధతులు మార్చుకున్నారంటూ ఓ తమిళ వెబ్సైట్ కథనాలు ప్రచురించింది. దానిపై ఆమె ఈ విధంగా స్పందించారు.
News December 12, 2024
ఫ్యామిలీలో గొడవ.. మంచు లక్ష్మీ మరో పోస్ట్
ఓ వైపు మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతుండగానే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న మరో పోస్ట్ చేశారు. ‘ఈ లోకంలో ఏదీ నీది కానప్పుడు, ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు’ అంటూ ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టారనే దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య రెండు రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.