News November 17, 2024
‘చెప్పులు’ నిషేధించాలని స్వతంత్ర అభ్యర్థి విజ్ఞప్తి.. ఎందుకంటే?

MHలో పరాందా నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పోలింగ్ బూత్ల వద్ద చెప్పులు నిషేధించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. తనకు EC చెప్పుల గుర్తు కేటాయించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం అభ్యర్థుల గుర్తు పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించడం నిషేధమని, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను నిలబెట్టేందుకు ఈ రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 10, 2026
రాహువు ప్రభావంతో లవ్ ప్రాబ్లమ్స్ వస్తాయా?

జ్యోతిష శాస్త్రం ప్రకారం.. జాతకచక్రంలో ఐదో స్థానంలో రాహువు ఉంటే ప్రేమ సమస్యలు వస్తాయి. దీనివల్ల భ్రమలకు లోనై తప్పుడు భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎదుటివారి నిజస్వరూపాన్ని గ్రహించలేక మోసపోవచ్చు. ఐదో స్థానంపై శని, కుజ గ్రహాల దృష్టి పడినా ప్రేమ బంధాలలో నిరంతరం కలహాలు, ద్వేషం, సంఘర్షణలు ఎదురవుతాయి. గ్రహ శాంతి పూజలు చేయించడం ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
News January 10, 2026
సౌత్ ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

సౌత్ ఇండియన్ బ్యాంక్ క్రెడిట్, టెక్నికల్ & రిస్క్ కంటైన్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. CA/CMA, MBA, డిగ్రీ , B.Arch/BTech/BE, PG ఫోరెన్సిక్ సైన్స్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 17వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ప్రిలిమినరీ/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. recruit.southindianbank.bank.in
News January 10, 2026
ఎట్టకేలకు పూర్తిగా తగ్గిన బ్లోఅవుట్ మంటలు

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఅవుట్ వద్ద ఎట్టకేలకు మంటలు తగ్గిపోయాయి. ఈ నెల 5న గ్యాస్ లీకై భారీగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాటర్ అంబ్రెల్లా ద్వారా మంటలను ఆర్పేందుకు ONGC సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. 5 రోజుల తర్వాత పూర్తిగా తగ్గాయి. దీంతో వెల్ క్యాపింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.


