News November 12, 2024

బర్త్ డేకు రావాలని ఆహ్వానం.. లోకేశ్ ఏమన్నారంటే?

image

AP: తమ కూతురి పుట్టినరోజు వేడుకలకు రావాలంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పారు. చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు, క్షణం తీరికలేని శాఖా వ్యవహారాలు ఉండటంతో వేడుకకు రాలేకపోతున్నందుకు మన్నించాలని కోరారు. కోనసీమ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని కలిసి, పాపకు ఆశీస్సులు అందజేస్తానని రిప్లై ఇచ్చారు.

Similar News

News September 15, 2025

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు

image

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా సౌర్యమాన్ పటేల్‌‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా ఐపీఎస్ రాహుల్ శర్మకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News September 15, 2025

బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా

image

TG: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల దావా పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గతంలో బండికి కేటీఆర్ నోటీసులు పంపారు. అయితే సంజయ్ వాటిపై స్పందించలేదు. దీంతో కేటీఆర్ చట్టపరమైన చర్యలకు దిగారు.

News September 15, 2025

వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలి: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రమంతటా LED వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలన్నారు. అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని, అవి పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అన్ని లైట్లను HYDలోని కమాండ్ కంట్రోల్ సెంటరుతో అనుసంధానం చేయాలని ఆదేశించారు.