News November 12, 2024
బర్త్ డేకు రావాలని ఆహ్వానం.. లోకేశ్ ఏమన్నారంటే?
AP: తమ కూతురి పుట్టినరోజు వేడుకలకు రావాలంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పారు. చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు, క్షణం తీరికలేని శాఖా వ్యవహారాలు ఉండటంతో వేడుకకు రాలేకపోతున్నందుకు మన్నించాలని కోరారు. కోనసీమ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని కలిసి, పాపకు ఆశీస్సులు అందజేస్తానని రిప్లై ఇచ్చారు.
Similar News
News December 12, 2024
చలికాలం అని సరిగా నీరు తాగట్లేదా?
చలికాలంలో సాధారణంగా నీరు పెద్దగా తాగాలనిపించదు. ఇలాగైతే సమస్యలొస్తాయని, కాలం ఏదైనా శరీరానికి నీరు అవసరమని వైద్యులు చెబుతున్నారు. నీటి % తక్కువైతే డీహైడ్రేట్ అయి పొడిచర్మం, అలసట, తలనొప్పి వస్తాయంటున్నారు. ప్రత్యామ్నాయంగా జ్యూస్, వాటర్ కంటెంట్ ఎక్కువుండే పండ్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే, శీతాకాలం చెమట పట్టక శరీరం నుంచి ఉప్పు బయటకు వెళ్లదు. అందుకే ఆహారంలో ఉప్పు తగ్గించాలని చెబుతున్నారు.
News December 12, 2024
2024: గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాలివే..
ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ సినిమాల లిస్ట్‌ను గూగుల్ ట్రెండ్స్ రిలీజ్ చేసింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించిన ‘స్త్రీ2’ తొలి స్థానంలో నిలిచింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో కల్కి 2898AD, 12TH FAIL, లాపతా లేడీస్, హనుమాన్, మహారాజ, మంజుమ్మల్ బాయ్స్, గోట్, సలార్, ఆవేశం టాప్-10లో నిలిచాయి.
News December 12, 2024
రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
AP: రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన అమలు కావట్లేదని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల 667 మంది మరణించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయట్లేదు? అని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మరణాలకు బాధ్యత ఎవరిది? అని సీరియస్ అయింది. దీనిపై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.