News April 2, 2024
సచివాలయానికి వెళ్తూ వృద్ధుడు మృతి.. రూ.5 లక్షల పరిహారం

AP: పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తూ కాకినాడ రూరల్ తూరంగిలో వెంకట్రావ్(70) అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపై సీఎం జగన్ సంతాపం తెలిపారు. వెంకట్రావ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.
Similar News
News December 6, 2025
టర్కీ కోళ్ల రకాలు – ప్రత్యేకతలు

☛ బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాంజ్: ఈ టర్కీ కోళ్ల ఈకలు నల్లగా ఉండి తోక చివరి భాగంలో మాత్రం తెల్ల రంగులో ఉంటాయి.
☛ బ్రాడ్ బ్రెస్టెడ్ లార్జ్ వైట్: ఈ తెలుపు రంగు టర్కీలు భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఇవి వేడిని తట్టుకోగలవు. డ్రెస్సింగ్ తర్వాత శుభ్రంగా కనిపిస్తాయి.
☛ బెల్టస్విల్లే స్మాల్ వైట్: ఈ రకం టర్కీ కోళ్లకు గుడ్ల ఉత్పత్తి, గుడ్డు పొదిగే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.
News December 6, 2025
పుతిన్కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆయనకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత కశ్మీరీ కుంకుమ పువ్వు, అస్సాంకు చెందిన ఫేమస్ బ్లాక్ టీ, మార్బుల్ చెస్ బోర్డు, మహారాష్ట్ర హస్త కళాకారులు చేత్తో చేసిన వెండి గుర్రం, ముర్షిదాబాద్కు చెందిన వెండి టీ కప్పుల సెట్ వంటి బహుమతులు అందజేశారు.
News December 6, 2025
వ్యూహ లక్ష్మి అచ్చును భక్తులందరూ చూడగలరా?

తిరుమలలో వ్యూహ లక్ష్మి దర్శన భాగ్యం అందరికీ దక్కదు. శ్రీవారిని గురు, శుక్ర వారాల్లో దర్శనం చేసుకునేవారికి మాత్రమే ఈ అరుదైన అవకాశం లభిస్తుంది. గురువారం నాడు శ్రీవారి ఆభరణాలు తొలగిస్తారు. అప్పుడు అమ్మవారిని నేరుగా చూడవచ్చు. మొదటి గడప దర్శనం అవకాశం దొరికిన వారికి వ్యూహలక్ష్మి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే శుక్రవారం రోజున అభిషేకం, నిజపాద దర్శనంలో అమ్మవారి పసుపు ముద్రను దర్శించుకోవచ్చు.


