News April 2, 2024

సచివాలయానికి వెళ్తూ వృద్ధుడు మృతి.. రూ.5 లక్షల పరిహారం

image

AP: పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తూ కాకినాడ రూరల్‌ తూరంగిలో వెంకట్రావ్(70) అనే వృద్ధుడు గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపై సీఎం జగన్ సంతాపం తెలిపారు. వెంకట్రావ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.

Similar News

News February 9, 2026

పల్నాడులో రూ. 1200 కోట్లతో ఇంటింటికి తాగునీరు!

image

పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా గురజాల, మాచర్ల, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ. 1200 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఉమ్మడి కృషితో ఈ నిధులు కేటాయించబడ్డాయి. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా నాగార్జునసాగర్ నుంచి 720 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు.

News February 9, 2026

ఆ డైరెక్టర్లు తిట్టినా.. డబ్బుకోసమే పనిచేశా: నటి

image

తాను నటించిన కొన్ని సినిమాలు విడుదలవ్వకూడదని ప్రార్థించినట్లు బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేర్కొన్నారు. తాను కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘కొన్ని సినిమాలు ఎందుకు సైన్ చేశానా అని బాధ పడ్డా. సెట్‌లో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొందరు డైరెక్టర్లు అకారణంగా నన్ను తిట్టేవారు. కేవలం డబ్బు కోసమే వాటిని పూర్తి చేశాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News February 9, 2026

APPLY NOW: NIT రాయ్‌పుర్‌లో ఉద్యోగాలు

image

<>NIT<<>> రాయ్‌పుర్‌ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి పీజీ, NET/M.Phill./PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 18న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.37,000+DA, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000+DA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nitrr.ac.in