News March 18, 2024

విజయనగరంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

image

విజయనగరం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగు చూసినట్లు ఎస్.ఐ హరిబాబు నాయుడు వెల్లడించారు. రిలయన్స్ మాల్‌కి ఎదురుగా ఉన్న తుప్పల్లో ఉరి వేసుకుని మరణించినట్లు వీఆర్వో సమాచారం అందించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

Similar News

News October 30, 2025

VZM: ఉద్యోగులకు క్రీడా ఎంపిక పోటీలు వాయిదా

image

ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు జరగాల్సిన క్రీడా ఎంపిక పోటీలను మొంథా తుఫాన్ కారణంగా నిరవధికంగా వాయిదా వేశామని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు వాయిదా వేశామని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల తదుపరి తేదీలు వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 30, 2025

ముంపు గ్రామాల్లో పంటల పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో మడ్డువలస డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గురువారం రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ముంపు ప్రభావిత గ్రామాల్లో పంటల నష్టం, ప్రజల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.

News October 30, 2025

డెంకాడ: నేలకొరిగిన వరి పంట పరిశీలించిన ఉన్నతాధికారులు

image

డెంకాడ మండలం చొల్లంగిపేట గ్రామపంచాయతీ పరిధిలోని మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి పంటను జిల్లా వ్యవసాయ అధికారి వీ.టి. రామారావు గురువారం పరిశీలించారు. ఎంత మేర నష్టం కలిగిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు నష్టపోయిన వరి పంట ఎకరాకు రూ. 10,000ల చొప్పున నష్టపరిహారం వచ్చే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని రైతులకు భరోసా కల్పించారు.