News March 18, 2024
విజయనగరంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

విజయనగరం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగు చూసినట్లు ఎస్.ఐ హరిబాబు నాయుడు వెల్లడించారు. రిలయన్స్ మాల్‌కి ఎదురుగా ఉన్న తుప్పల్లో ఉరి వేసుకుని మరణించినట్లు వీఆర్వో సమాచారం అందించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
Similar News
News July 10, 2025
VZM: అభ్యంతరాలు ఉంటే చెప్పండి

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ పద్మలీల తెలిపారు. 20 విభాగాల్లో 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 12 విభాగాలకు సంబంధించి స్పీకింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. జాబితా https://vizianagaram.nic.inలో అందుబాటులో ఉందని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఆమె కోరారు.
News July 10, 2025
VZM: అగ్నిపథ్‌లో అవకాశాలు

అగ్నిపథ్ పథకంలో భాగంగా భారతీయ వాయుసేనలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 4 ఏళ్ల కాల పరిమితికి అగ్నివీర్(వాయు)గా చేరడానికి అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 11న ఉదయం 11 గంటలకు ప్రారంభమై, జులై 31న రాత్రి 11 గంటలకు ముగుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News July 10, 2025
నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెట్టాలి: SP

నేరాల నియంత్రణకు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు శక్తి యాప్‌పై అవగాహన చేపట్టాలన్నారు. విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించేందుకు శక్తి వారియర్స్ టీమ్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.