News April 24, 2024
అమ్ముడుపోని ఆటగాడు అదరగొడుతున్నాడు
IPLలో మోస్ట్ అండర్‌రేటెడ్ బౌలర్లలో సందీప్ శర్మ తొలి స్థానంలో ఉంటారు. ఆరంభ ఓవర్లలో స్వింగ్, డెత్ ఓవర్లలో స్లో బాల్స్‌తో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తారు. 119 మ్యాచుల్లో 7.84 ఎకానమీతో 130 వికెట్లు తీశారు. ఆసక్తికర విషయమేంటంటే.. గతేడాది వేలంలో సందీప్ శర్మను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. రూ.50 లక్షల కనీస ధరకూ ఎవరూ కొనుగోలు చేయలేదు. చివరకు ఓ ప్లేయర్ గాయపడటంతో అతడి స్థానంలో రాజస్థాన్ శర్మను తీసుకుంది.
Similar News
News January 17, 2025
ACCIDENT: 9 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని నాసిక్-పుణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఐచర్ ప్యాసింజర్లతో వెళ్తోన్న మాక్సిమోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మాక్సిమో ముందున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ధాటికి మాక్సిమో నుజ్జునుజ్జయింది. పుణే సమీపంలోని నారాయణ్‌గావ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ అయింది.
News January 17, 2025
ఆర్థిక వ్యవస్థలో అమెరికాను దాటనున్న ఇండియా!
రానున్న 50 ఏళ్లలో ఇండియా జీడీపీ భారీగా పెరుగుతుందని ‘గోల్డ్‌మన్ సాక్స్’ అంచనా వేసింది. 2075 నాటికి ఇండియా $52.5 ట్రిలియన్‌తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. $57 ట్రిలియన్‌తో చైనా జీడీపీలో నంబర్ 1గా మారనుందని తెలిపింది. కాగా, మూడో స్థానంలో USA ($51.5 ట్రిలియన్), నాలుగో ప్లేస్‌లో ఇండోనేషియా ($13.7ట్రి), ఐదో స్థానంలో నైజీరియా ($13.1ట్రి) ఉంటాయని వెల్లడించింది.
News January 17, 2025
BJP మ్యానిఫెస్టో: అబ్బాయిలకూ ఫ్రీ బస్సు?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని చదువుకునే అబ్బాయిలకు, వృద్ధులకూ కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్కీం కింద మహిళలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అలాగే గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ నడ్డా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.