News April 25, 2024

అనకొండల స్మగ్లింగ్.. ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్ట్

image

బతికున్న 10 అనకొండలను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతను 10 అనకొండలను చెక్ ఇన్ బ్యాగ్‌లో దాచి బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. వన్యప్రాణుల అక్రమ రవాణాను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కాగా గత సెప్టెంబర్‌లో 72 పాములు, 55 పైథాన్స్, 17 కింగ్ కోబ్రాల అక్రమ రవాణాను అధికారులు అడ్డుకున్నారు.

Similar News

News December 6, 2025

NZB: మూడు రోజుల్లో నామినేషన్లు ఎన్నంటే?

image

ఆలూరు 11 GPల్లో SP 58, WM- 273, ARMR14 GPల్లో SP 105, WM 387, బాల్కొండ 10 GPల్లో SP 76, WM 237, BMGL 27 GPల్లో SP 175, WM 577, డొంకేశ్వర్ 13 GP ల్లో SP 65 , WM 223, మెండోరా 11 GPల్లో SP 63, WM 270, మోర్తాడ్ 10 GPల్లో SP 70, WM 294, ముప్కాల్ 7 GPల్లో SP 65, WM 246, NDPT 22 GPల్లో SP 133, WM 571, వేల్పూర్ 18 GPల్లో SP 121, WM 426, ఏర్గట్ల 8 GPల్లో SP 49, WM 174, కమ్మర్పల్లి 14 GPల్లో SP97, WM 343.

News December 6, 2025

న్యూస్ రౌండప్

image

⋆ నేడు నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ పర్యటన
⋆ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
⋆ నేషనల్ హెరాల్డ్ కేసులో DK శివకుమార్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. DEC 19న విచారణకు రావాలని ఆదేశం
⋆ నేడు మరోసారి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి
⋆ శాంతిభద్రతల పరిరక్షణకు HYDలో ‘ఆపరేషన్ కవచ్’.. నిన్న అర్ధరాత్రి దాదాపు 5,000 మంది పోలీసులతో ఏకకాలంలో 150 ప్రాంతాల్లో తనిఖీలు

News December 6, 2025

ఫోన్‌ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. ఎందుకోసం?

image

ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) వ్యవస్థ నిరంతరం యాక్టివేట్ చేసి ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోన్ మేకర్లకు ఆదేశాలివ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసుల దర్యాప్తులో ప్రభుత్వ ఏజెన్సీలు లొకేషన్ కోసం సెల్యులార్ టవర్ డేటాపై ఆధారపడుతున్నాయి. కానీ కచ్చితమైన లొకేషన్ గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో A-GPSను తప్పనిసరి చేయాలని టెలికాం సంస్థలు ప్రతిపాదించాయి.