News March 17, 2024
అనకాపల్లి: ‘ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం’

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టం శెట్టి, ఎస్పీ కేవీ మురళీ కృష్ణ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనకాపల్లి వ్యాప్తంగా 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైనా రూ.50 వేల వరకు నగదు క్యారీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
Similar News
News April 24, 2025
పదో తరగతి ఉత్తీర్ణతలో 98.41%తో పద్మనాభం టాప్

విశాఖ జిల్లాలో మండలాల వారీగా 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. పద్మనాభం 98.41%తో మొదటి స్థానంలో, విశాఖ అర్బన్ 83.17%తో చివరి స్థానంలో నిలిచాయి. ఆనందపురం 89.78, భీమునిపట్నం 91.74, చినగదిలి 85.27, గాజువాక 90.22, గోపాలపట్నం 89.78, ములగాడ 92.29, పెదగంట్యాడ 83.75, పెందుర్తి 91.14, సీతమ్మధార 91.57% ఉత్తీర్ణత సాధించాయి.
News April 24, 2025
సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం

కశ్మీర్ ఘటనలో మృతి చెందిన చంద్రమౌళికి ఘన నివాళి అర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్న ఆయన చంద్రమౌళికి నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో పాటు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, తదితరులు వీడ్కోలు పలికారు.
News April 23, 2025
చంద్రమౌళి మృతదేహానికి సీఎం నివాళి

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. ముందుగా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యలను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీఎంతో పాటు ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి, పలువురు కూటమి నాయకులు ఉన్నారు.